The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచేస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 - జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) Telangana విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
వెంకటేశ్ అయ్యర్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆయన న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఐపీఎల్-2022 వేలంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) అతి పెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు.
రుద్రుడు ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై తెలుగులో ‘రుద్రుడు’, తమిళంలో ‘రుద్రన్’ పేర్లతో కతిరేసన్ నిర్మాతగా & దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ప్రియ భవాని శంకర్, శరత్ కుమార్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాడాద పాటెలం లిరికల్ పాటను ఫిబ్రవరి 11న ఆవిష్కరించి, సినిమాను ఏప్రిల్ 14న విడుదలైంది.
దాస్ కా ధమ్కీ 2023లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మించిన సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, హైపర్ ఆది, పృథ్విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఏప్రిల్ 14 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
“జీటా ప్రమేయం యొక్క శూన్యస్థానాలు (zeros of the zeta function) లేదా మూలాలు (roots) అన్నీ (నిజ, రుణ రేఖ మీద కనబడే సాధారణ మూలాలని మినహాయించి) సంకీర్ణ లేదా జంట తలంలో (అనగా, complex plane లో) x = ½ అనే రేఖ మీదే గుమిగూడి ఉన్నాయి” అన్నది నిజమే సుమా అని రీమాన్ ఒక అమూల్య అభిప్రాయం వెలిబుచ్చేరు - రుజువు చెయ్యకుండా! ఇలా "రీమాన్ ఉటంకించిన శిష్టాభిప్రాయం (conjecture) ఒప్పే” అని రుజువు చేస్తే క్లే మేథమేటికల్ ఇన్స్టిటూట్ (Clay Mathematical Institute) వారు మిలియను డాలర్లు ఇస్తామని 2000 లో ప్రకటన చేసేరు. ఇక్కడ శిష్టాభిప్రాయం (conjecture) అన్నా దత్తాంశం (hypothesis) అన్నా అర్థం ఒక్కటే.
గంగా పుష్కరం (Ganga Pushkaram) అనగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగా నది యొక్క ఒక పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది.