The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలైంది.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజలు ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో వేసి ఉచితంగా చూపించారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక విధాలైన పూజలు జరుగుతూ ఉంటాయి.
ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు.
పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)
పంచాయితీ గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని, భారతదేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు. నేపాల్‌లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
గంగా పుష్కరం (Ganga Pushkaram) అనగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగా నది యొక్క ఒక పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్‌తో డిసెంబరు 2004 లో ఆడాడు.,, శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
దక్షుడు బ్రహ్మ కుడి బొటనవేలు నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు.వీరికి కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మొదలైన యాబైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు.వీరియందు ఎనిమిదిమంది ముఖ్యులు.వీరిలో సతియను ఆమె పెద్దది.ఆమెను శివుని కిచ్చి పెళ్ళి చేసెను.యజ్ఞం చేసి తన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడినీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది.
భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం.1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.