The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నేతన్నకు చేయూత పథకం (తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీం) అనేది తెలంగాణ రాష్ట్ర నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా చేనేత పరిశ్రమలను జియో ట్యాగింగ్ ద్వారా ఎంపికచేసి, తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీం కింద ఈ పథకం ద్వారా నిధులు పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా నేత కార్మికులు, డిజైనర్స్, డయ్యర్స్, వార్పింగ్, వైండింగ్, బ్లీచింగ్, రోలింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరుతున్నది.
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం. ఇది హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.
ఆరు (సిక్స్ పాయింట్ పార్ములా) పాయింట్ల ప్రాణాళికకు అనుగుణంగా రాష్ట్రపతి ఆదేశాన్ని అమలు చేయటానికి 1985 డిసెంబర్ 30 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 610 జారీచేసింది. ఈ ఉత్తర్వు రాష్ట్రములోని ఒక ప్రాంతములో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను తొలగించి, స్థానికులను నియమంచి అసమతౌల్యాన్ని తగ్గించటానికి ఉద్దేశించింది.
ఆదిరెడ్డి భవాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కూతురు, శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన నాయుడు సోదరి.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు. భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
జన్యుశాస్త్రం (ఆంగ్లం Genetics) వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ (from గ్రీకు genetikos, “genitive” and that from genesis, “origin”), జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత (heredity) కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు.
అనభేరి ప్రభాకరరావు ( 1910 ఆగస్టు 15 – 1948 మార్చి 14) తెలంగాణ రాష్ట్ర గెరిల్లా నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకడిగా గుర్తింపబడ్డాడు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి 1948 మార్చి 14న జరిగిన దాడిలో మరణించాడు.నిజాం సామ్రాజ్యం/రజాకార్ల నుంచి తెలంగాణను విముక్తి చేయడమే జీవిత లక్ష్యంగా, తెలంగాణలో విప్లవోద్యమానికి కొత్త ఒరవడిని అందించిన ప్రభాకరరావును కరీంనగర్/తెలంగాణ భగత్ సింగ్ అని పిలిచేవారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) అనేది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అఖిల భారతదేశ సాధారణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 2012 లో, అంతకు పూర్వం ప్రభుత్వం నడుపుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే AIEEE, ఐఐటీ-జేఈఈ స్థానంలో ఈ సాధారణ పరీక్షను ప్రభుత్వం ప్రకటించింది.
విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలైంది.