The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
హనుమంతుని జన్మోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఆంగ్లం: World Health Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది. WHO స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) అనేవి, 2030 నాటికి ప్రపంచంలోని బహుముఖ రంగాలలో పేదరికాన్ని రూపు మాపడానికి, సమస్త విశ్వ శ్రేయోసమృద్ధి కోసం ఒక సమానమైన, న్యాయమైన మరియు సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడానికై తీసుకొన్న ఒక దృఢమైన, సార్వత్రిక ఒప్పందము. మన ప్రపంచమును రూపాంతరం చేయుటలో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 169 నిర్దేశిత లక్ష్యాలు ఒక భాగం. సుస్థిర అభివృద్ధి కొరకు 2030 ఎజెండా, 2015 సెప్టెంబరులో జరిగిన చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమ్మేళనంలో 193 సభ్యరాజ్యాలచే స్వీకరించబడి, 2016, జనవరి 1 వ తేదీ నుండి అమలులోనికి వచ్చింది.ఆశాదాయకమైన ఈ ఎజెండా గురించి చర్చించి ఆచరించడానికై, జాతీయ ప్రభుత్వాలు, ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్ది పౌరులను ఒక చోట చేర్చి మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించబడిన సంప్రదింపు ప్రక్రియల ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రూపొందించబడ్డాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ప్రేమ దేశం 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథా సినిమా. శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీష సిద్ధం నిర్మించిన శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించాడు. త్రిగుణ్, మేఘా ఆకాష్, మధుబాల, అజయ్ కతుర్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మ్యూజికల్ గ్లింప్స్‌ను మే 4న విడుదల చేసి, ట్రైలర్‌ను నవంబర్ 14న, సినిమా 2023 ఫిబ్రవరి 3న విడుదలైంది.
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.రంగులు లేదా వర్ణాలు (ఫ్రెంచ్: Couleur, ఇటాలియన్: Colore, జర్మన్: Farbe, స్వీడిష్: Färg, లాటిన్, స్పానిష్, ఆంగ్లం: Color) మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. ప్రకృతిలో సాధారణంగా కనిపించే ఏడు రకాల రంగుల్ని సప్తవర్ణాలు అని పేర్కొంటారు .
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
స్మిత్సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ , సంగ్రహాలయాల సముదాయము. ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు , బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి.లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా , ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నాయి.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది.
ఫెడరేషన్ ఫారెస్ట్ స్టేట్ పార్క్
ఫెడరేషన్ ఫారెస్ట్ స్టేట్ పార్క్ అనేది కింగ్ కౌంటీలోని వైట్ నదిపై 619 ఎకరాలలో (251 హెక్టార్లు)ఉంది. ఇది వాషింగ్టన్ స్టేట్ పార్క్. ఈ పార్క్ ఎనుమ్క్లాకు తూర్పున 15 మైళ్ళు (24 కిమీ) రూట్ 410 లో చినూక్ పాస్ శిఖరం క్రింద 30 మైళ్ళు (48 కిమీ) దిగువన ఉంది.
ర్యాంకింగ్ లేదా ర్యాంకు అనేది సంబంధమున్న ఏవైనా రెండు అంశాలకు మధ్య లేదా అలాంటి అంశాల యొక్క సమితి మధ్య సంబంధాన్ని క్రోడీకరించి మొదటిది రెండవ దానికి "దాని కంటే ఉన్నత ర్యాంకు", లేదా "దాని కంటే తక్కువ ర్యాంకు" లేదా "సమాన ర్యాంకు" అని ఏదో ఒక దానిని తెలిపే ఒక గణాంకం. గణితశాస్త్రంలో ఇది ఒక వీక్ ఆర్డర్ గా లేదా మొత్తం వస్తువుల యొక్క ప్రీఆర్డర్ గా గుర్తింపు పొంది ఉంది. ఇది వస్తువుల యొక్క ఒక మొత్తం క్రమంలో తప్పనిసరేమి కాదు ఎందుకంటే రెండు వేర్వేరు వస్తువులు అదే ర్యాంకింగ్ కలిగి ఉండవచ్చు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
ఫారెన్‌హీట్ అనేది జర్మన్ భౌతిక శాస్త్రవేత్త డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్ (1686-1736) ద్వారా 1724 లో ప్రతిపాదించిన ఒక ఆధారంగా ఉష్ణోగ్రత స్కేలు, తర్వాత ఈ స్కేలుకు ఇతని పేరు పెట్టారు. దీని యూనిట్ గా డిగ్రీ ఫారన్‌హీట్ (చిహ్నం °F) ఉపయోగిస్తారు. దీని తక్కువ నిర్వచన పాయింట్ 0 డిగ్రీలు, మంచు, ఉప్పు సమాన భాగాల నుంచి తయారయ్యే ఉప్పునీరు యొక్క ఒక పరిష్కారం యొక్క ఉష్ణోగ్రత వద్ద స్థిర పరచబడింది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
రావణాసుర 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ, ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది.
ఈ వ్యాసం న్యూయార్క్ నగరం గురించి. అదే పేరుతో ఉన్న రాష్ట్రం కొరకు న్యూయార్క్ రాష్ట్రం చూడండి.న్యూయార్క్ నగరం (ఆంగ్లం : New York City) (అధికారికంగా న్యూయార్క్ యొక్క నగరం) అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది.
గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ మరియు తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా వ్యవస్థాపకుడు, దాని మొదటి నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్లో 2011 మే 2 న స్థానిక సమయం అర్ధరాత్రి 1:00 (భారత సమయం 1:30) తరువాత అమెరికా దేశపు నావల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ కు చెందిన నేవీ సీల్స్ సైనికులు సంహరించారు. ఈ బృందాన్ని DEVGRU లేదా సీల్ టీం సిక్స్ అని కూడా పిలుస్తారు. సిఐఎ నేతృత్వం వహించిన, ఆపరేషన్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరున్న ఈ ఆపరేషనులో సిఐఎ తో పాటు, దాడిలో పాల్గొన్న స్పెషల్ మిషన్ యూనిట్లతో సమన్వయం చేస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC) కూడా పాల్గొంది.
గ్రాము (ఇతర ఉచ్ఛారణ: గ్రామ్మ్ ;ఎస్.ఐ.ప్రమాణ గుర్తు: g) అనేది మెట్రిక్ ప్రమాణాల వ్యవస్థలో ద్రవ్యరాశికి ప్రమాణం. వాస్తవంగా " మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు1 ఘనపు సెంటీమీటరు ఘనపరిమాణంలో గల శుద్ధ జలం బరువు 1 గ్రాముకు సమానం; ప్రస్తుతం గ్రాము అనేది ఎస్.ఐ ప్రమాణాల వ్యవస్థలో ఒక కిలోగ్రాము ద్రవ్యరాశిలో 1000 వ వంతు ద్రవ్యరాశి. ఈ ప్రమాణాన్ని ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ బెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ నిర్థారించింది.
యేసుకు 12 మండి శిష్యులు. పండ్రెండుమంది శిష్యులు/అపొస్తలుల పేర్లు మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంధ్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలోమయి తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.“శిష్యుడు” అనే పదము నేర్చుకొనువాడు లేక అనుసరించువాడు అని సూచించును. “అపొస్తలుడు” అనే పదమునకు అర్థము “బయటకు పంపబడినవాడు.” యేసు భూమిమీద ఉన్నప్పుడు, అతని పండ్రెండు మంది అనుచరులు శిష్యులుగా పిలువ బడిరి.