The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఈస్టర్ డే అనేది క్రైస్తవ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి 22 మరియు ఏప్రిల్ 25 మధ్య వచ్చే వసంత విషువత్తు తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. పవిత్ర బైబిల్ యేసుక్రీస్తు పునరుత్థానానికి దారితీసిన మరియు అనుసరించే సంఘటనలను వివరిస్తుంది, విశ్వాసులకు గొప్ప మరియు శక్తివంతమైన కథనాన్ని అందిస్తుంది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
ఆంధ్ర మహాసభ (IAST: ''Andhra Mahasabha'') నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతపు తెలుగువారు ప్రారంభించిన సంఘం. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 1920వ దశకం చివర్లో మాడపాటి హనుమంతరావు నేతృత్వములో తెలుగు ప్రజలు సంఘటితమై ఒక సంఘముగా ఏర్పడి 1930 నుండి 1945 వరకు 13 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ మొదటి జనవరి 2023లో ప్రపంచ కప్ టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో నిర్వహించగా తొలిసారి విజేతగా భారత జట్టు ఐసీసీ వరల్డ్‌కప్ గెలిచింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది.
జిజియా లేదా జిౙయా (jizya లేదా jizyah (అరబ్బీ: جزية ǧizyah IPA: [dʒizja]; Ottoman Turkish: cizye;) ఒక తలసరి ఆదాయంపై విధించే/వసూలు చేసే పన్ను. సాధారణంగా ఇది ఇస్లామీయ దేశాలలో ఇది ముస్లిమేతరులపై విధించే పన్ను విధానం, అందులోనూ నిర్దిష్టమైన విధానాలకు లోబడి మాత్రమే. ఈ పన్ను ముస్లిమేతరులైన "పురుషులు", సైన్యంలో పనిచేసే వయస్సు అర్హత గలిగి, అధికారాలకు పొందగలిగినవారికి మాత్రమే వర్తించేది.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2023 ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 12న ముగిసాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ 2023 ఫిబ్రవరి 6న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు నాలుగవసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి)) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన మరియు క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య . పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నరసయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు.
క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ (Prof.Christoph von Fürer-Haimendorf) (1909-1995) లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన మానవశాస్త్ర ఆచార్యుడు. 1940లో కొమరం భీం అనే గోండు విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై, దోపిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరంభీంని, అదిలాబాదులోని "జోడేఘాట్" వద్ద కాల్చి చంపినా, గోండులలో చెలరేగిన అలజడిని, అశాంతిని అణచలేకపోయారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ : తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు, భావోద్వేగాల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. 2010 ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రమంతా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ- అనేక విషయాలను లోతుగా పరిశీలించింది. వివిధ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించిన అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది.
వీడియో అనేది కదిలే దృశ్య మాధ్యమం యొక్క రికార్డింగ్, కాపీ చేయడం, ప్లేబ్యాక్, ప్రసార, ప్రదర్శనల కొరకు ఉన్న ఒక ఎలక్ట్రానిక్ మాధ్యమం. వీడియో వ్యవస్థలు ప్రదర్శన యొక్క స్పష్టతలో ఎంతగానో మారుతుంటాయి, ఎలా అంటే ఇవి రిప్రెష్ అవుతాయి, రిప్రెష్ రేటు అవుతాయి, 3D వీడియో వ్యవస్థలు ఉనికిలో ఉన్నాయి. వీడియో ఒక సాంకేతికత.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.