The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మన ఊరు - మన బడి (మన బస్తీ - మన బడి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలతో ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
డేటింగ్ (Dating) అనగా శృంగార సంబంధమును కోరుకుంటూ ఇద్దరు వ్యక్తులు కలిసి బయట తిరిగేందుకు వెళ్ళడం. వివాహము చేసుకోవాలనుకున్న ఇద్దరు భాగస్వాములుగా మనం మనగలుగుతామా, అనుకూలంగా ఉండగలుగుతామా అని ఒకరికొకరు తెలుసుకునే లక్ష్యంతో ఈ డేటింగ్ చేస్తారు. కలిసి సినిమాకు వెళ్ళడం, తినేందుకు రెస్టారెంటు వెళ్ళడం వంటి వాటి వలన అప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది, ఒకరికొకరు ఎలా ఉండాలో ఈ సమయంలో వీరు తెలుసుకుంటారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్‌తో డిసెంబరు 2004 లో ఆడాడు.,, శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ.
సాహిత్యం (లాటిన్ litterae నుండి (బహువచనం) అక్షరం) అనేది రచనల చేసే ఒక కళ, ఇది ప్రచురించబడిన వనరులకు మాత్రమే పరిమితం కాదు (అయితే, కొన్ని పరిస్థితుల్లో వాటిని మినహాయించవచ్చు). సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం" ("కళలు , అక్షరాలు"లో వలె). రెండు ప్రాథమిక రచనా సాహిత్య వర్గాల్లో కల్పన , కల్పనేతర వర్గాలు ఉన్నాయి.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
ఇంటర్ స్టెల్లర్ (2014) (ఆంగ్లం: Interstellar) చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కదానాయకుడిగా "మాథ్యు మెక్ కానవె" నటించారు. ఈ చిత్రం యొక్క కథ క్లుప్తంగా " భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేదైనా పాలపుంతలొ మనుష్యులు జీవించుటకు అనువైన స్థలం ఉందేమో వెతుకుటకు బయలు దేరిన నలుగురు వ్యొమగాములు యొక్క కథ.
ఆదిత్య చోప్రా (జననం 21 మే 1971) ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్ర్కీన్ రచయిత, బ్రాడ్ కాస్ట్ నిర్మాత, పంపణీదారు. ఈయన దర్శకత్వం వహించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే) (తెలుగులో ప్రేమించి పెళ్ళాడుతా (1995) ), మొహొబ్బతే (2000), రబ్ నే బనాదీ జోడీ (2008), బేఫికర్ (2016) వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.45ఏళ్ల చరిత్ర కలిగిన యశ్ రాజ్ ఫిలింస్ కు చైర్మన్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన వీర్-జారా (2004), ఫనా (2006), బ్యాండ్ బాజా బారాత్ (2010), ఎక్ థా టైగర్ (2012), జబ్ తక్ హై జాన్ (2012), ధూమ్ 3 సిరీస్ లు (2004, 2006, 2013), సుల్తాన్ (2016) వంటి సినిమాలు కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ హిట్ అయ్యాయి.
టేలర్ ఏలిసన్ స్విఫ్ట్(జననం: 1989 డిసెంబరు 13 అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి. పెన్సిల్వేనియా లోని వయోమిస్సింగ్ లో పెరిగిన స్విఫ్ట్, జానపద సంగీతంలో అవకాశాలు కోసం, పద్నాలుగు సంవత్సరాల వయస్సులో టెన్నిసీ లోని నేష్విల్కి బస మార్చింది. బిగ్ మెషీన్ రికార్డ్స్ అనే కంపెనీతో ఖరారునామా కుదుర్చుకుని, అతి చిన్న వయస్సులో సోనీ / ATV మ్యూజిక్ పబ్లిషింగ్ హౌస్ రికార్డు విడుదల చేయించుకుని చరిత్ర సృష్టించింది.
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన మూడో నేతగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నిలిచాడు. ఆయన తొలిసారిగా 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరీన్ లీ పెన్ను ఓడించి కేవలం 39 ఏళ్ల వయసులో అతి పిన్న వయసు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రికార్డులకెక్కాడు.
సియోల్ (Korean: 서울 [sʰʌ̹uɭ]; అక్షరాల 'రాజధాని') దక్షిణ కొరియా రాజధాని, అతిపెద్ద మహానగరం, ప్రపంచ నగరంగా ర్యాంక్ పొందిన సియోల్, టోక్యో, న్యూయార్క్ నగరం, లాస్ ఏంజిల్స్ తరువాత 2014 లో 635 బిలియన్ డాలర్ల జిడిపితో ప్రపంచంలో 4వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ఆర్థిక వ్యవస్థ. విమానాశ్రయాల కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరుసగా తొమ్మిది సంవత్సరాలు (2005–2013) ఉత్తమ విమానాశ్రయంగా రేట్ చేయబడినది. 2015 లో, ఆర్కాడిస్ చేత ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక జీవన ప్రమాణాలతో ఆసియా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా రేట్ చేయబడింది, సియోల్‌లో తలసరి జిడిపి $ 40,000 గా ఉంది.
"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసముల ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి.
మ్యూజికల్ నోటేషన్ లేదా సంగీత సంజ్ఞామానం అనేది వ్రాతపూర్వక, ముద్రిత లేదా ఇతర-ఉత్పత్తి చిహ్నాలను ఉపయోగించడం ద్వారా వాయిద్యాలతో వాయించే లేదా మానవ స్వరం ద్వారా వినిపించే సంగీతాన్ని దృశ్యమానంగా సూచించడానికి ఉపయోగించే ఏదైనా వ్యవస్థ, అలాగే విశ్రాంతి వంటి ధ్వని లేని వ్యవధి కోసం సంజ్ఞామానం ఉంటుంది. ఇది సంగీతకారులు సంగీతాన్ని కమ్యూనికేట్ చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి ఉపయోగించే చిహ్నాలు మరియు గుర్తుల వ్యవస్థ. ఇది సంగీత శబ్దాల పిచ్, వ్యవధి మరియు తీవ్రతను సూచించే వ్రాతపూర్వక లేదా ముద్రిత చిహ్నాలను కలిగి ఉంటుంది, అలాగే ఉచ్చారణ, డైనమిక్స్ మరియు టెంపో వంటి ఇతర సంగీత సమాచారాన్ని కలిగి ఉంటుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆల్బర్ట్ కామూ (1913 నవంబరు 7 – 1960 జనవరి 4) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెల్ బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. ఇతని ఆలోచనలు అసంగతవాదం అనే సరి కొత్త తత్వ సిధ్ధాంత పుట్టుకకు ప్రేరణనిచ్చాయి. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, nihilism ని వ్యతిరేకించడానికే సరిపోయింది”.