The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
హనుమంతుని జన్మోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
కైలాసగిరి భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక కొండ పైన ఉన్న ఉద్యానవనం. ఈ పార్క్ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చేత అభివృద్ధి చేయబడింది, ఇది 380 ఎకరాల (150 హెక్టార్లు) భూభాగం, ఉష్ణమండల చెట్లతో కప్పబడి ఉంటుంది. 360 అడుగుల (110 మీ) వద్ద ఉన్న కొండ, విశాఖపట్నం పట్టణాన్ని విస్తరిస్తుంది.
రుద్రుడు ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై తెలుగులో ‘రుద్రుడు’, తమిళంలో ‘రుద్రన్’ పేర్లతో కతిరేసన్ నిర్మాతగా & దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ప్రియ భవాని శంకర్, శరత్ కుమార్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాడాద పాటెలం లిరికల్ పాటను ఫిబ్రవరి 11న ఆవిష్కరించి, సినిమాను ఏప్రిల్ 14న విడుదలైంది.
కైలాస పర్వతం (టిబెట్ భాష: གངས་རིན་པོ་ཆེ, కాంగ్రింబొకె లేదా గాంగ్ రింపోచే; సంస్కృతం: कैलाश पर्वत, కైలాస పర్వత; చైనీస్: 冈仁波齐峰, గంగ్రెన్ బొకి ఫెంగ్ ) టిబెట్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది (సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి, గతంలో మైసూర్ ముఖ్యమంత్రి అని పిలిచేవారు, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వహణాధికారి. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర గవర్నరు రాష్ట్ర న్యాయనిర్ణేత అధిపతి, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఇది అన్ని ఇతర భారతీయ రాష్ట్రాలకు వర్తిస్తుంది.
శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (ఆగ్లం: Sir Arthur Cotton) ( 1803 మే 15 - 1899 జూలై 24) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి చిరస్మరణీయడైయ్యాడు.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.యునెస్కో 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది.
సందీప్ ఉన్నికృష్ణన్, ఎ సి (15 మార్చి 1977 - 28 నవంబర్ 2008) ఒక భారతీయ ఆర్మీ అధికారి, అతను డెప్యూటేషన్‌పై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని ఎలైట్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్‌లో పనిచేస్తున్నాడు. నవంబర్ 2008 ముంబై దాడుల సమయంలో అతను ఉగ్రవాదుల చర్యలో మరణించాడు. తత్ఫలితంగా, అతను 26 జనవరి 2009న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేత భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అయిన అశోక చక్రను అందుకున్నాడు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.