The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి, గతంలో మైసూర్ ముఖ్యమంత్రి అని పిలిచేవారు, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వహణాధికారి. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర గవర్నరు రాష్ట్ర న్యాయనిర్ణేత అధిపతి, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఇది అన్ని ఇతర భారతీయ రాష్ట్రాలకు వర్తిస్తుంది.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి. జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
స్టీఫెన్ విలియం హాకింగ్ (1942 జనవరి 8 - 2018 మార్చి 14) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు. మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చి డైరెక్టరుగా ఉన్నాడు. 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
మైక్రోసాఫ్ట్ కార్పోరేషను, NASDAQ: MSFT ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, మే 2004 నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మాండ్ నగరంలో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ 1975 వ సంవత్సరంలో బిల్ గేట్స్ మరియూ పౌల్ అలెన్ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు.
మన ఊరు - మన బడి (మన బస్తీ - మన బడి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలతో ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వడదెబ్బ (Heat stroke) లేదా ఎండదెబ్బ అంటే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని వేడిని నియంత్రించే విధానం (thermoregulation) విఫలమవడం. చాలా వేడియైన వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా తీవ్ర వ్యాయామం లాంటి చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి.
తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు
తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. అంటే ఈ జాతులు నివాసాల నుండి కనుమరుగు అయ్యే దశకు దగ్గరగా ఉన్న జాతులు. ఈ వర్గానికి చెందిన జాతులను అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జాతులుగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) IUCN Red Listలో గుర్తించింది.
అరుబా (pronounced /əˈruːbə/ ə-ROO-bə) అనేది వెనిజుల తీరానికి ఉత్తరంగా 27 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కరేబియన్ సముద్రములోగల లెస్సెర్ ఆంటిల్లీస్ లోని 33 కిలోమీటర్ల-పొడవు ఉండే ఒక ద్వీపము. ఇది బోనైరి , కొరకోలతో కలసి లీవార్డ్ ఆంటిల్లీస్ యొక్క ఎ.బి.సి. ద్వీపాలు అనే ఒక ద్వీప సమూహ సమాహారం, ఇది లెస్సెర్ ఆంటిల్లీస్ ద్వీపహారంలో భాగంగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు
తెలుగులో వైజ్ఞానిక విషయాల రాసే వారికి వైజ్ఞానిక విషయాల మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు వేరుగా వుంటాయి.
శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
టీవి9 - తెలుగు భారతదేశంలోని ప్రముఖ న్యూస్ టెలివిజన్ సంస్థయైన (TV9) నెట్వర్క్ లో భాగం. అసోషియెటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కంపెనీ(ఏబిసిల్) 2004 జనవరిలో టి.వి.9 ని ప్రారంభించింది. 2018 ఆగస్టులో తొలి పెట్టుబడిదారుడైన శ్రీనిరాజు నుండి అలందా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఏబీసీఎల్ లో మెజారిటీ వాటా 90.45%ను కొనుగోలు చేసింది.