The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మన దేశం (1949) 1962వ సం చిత్రం శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ను చేర్చలేదు.
విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 21న విడుదలైంది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
మహేంద్ర చక్రవర్తి కొక్కిరిగడ్డ
మహేంద్ర చక్రవర్తి కొక్కిరిగడ్డ తెలుగు నాటకరంగ దర్శకుడు, సినిమా రచయిత, నటుడు, నట శిక్షకుడు mariyu . ఆధునిక నాటకరంగంలో 29 సంవత్సరాలుగా దర్శకుడిగా దక్షణ భారతదేశ విభాగంలో 12సార్లు జాతీయస్థాయిలోనూ, 4సార్లు రాష్ట్రస్థాయి నంది అవార్డులు పొందాడు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 26 ఏళ్ళుగా జైలుశిక్ష అనుభవించిన నళిని జీవిత కథను ''కథా నళిని'' అనే నాటకంగా రూపొందించి తన దగ్గర శిక్షణ పొందిన నటీనటులచే ప్రదర్శించాడు, కళాకారుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
మళ్లీ పెళ్లి 2023లో తెలుగులో విడుదల కానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ వీ.కే నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. నరేష్, పవిత్రా లోకేష్, జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 21న, ట్రైలర్‌ను ఏప్రిల్ 11న విడుదల చేసారు.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
నూతన పార్లమెంటు భవనం అనేది భారతదేశం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం. ఇది ప్రస్తుత భారత పార్లమెంటు భవనానికి ఎదురుగా ఉంది. కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబరు 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసాడు.1927లో నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనంలో నేటి అవసరాలకు తగినంత స్థలం లేకపోవడంతో పాటు తగినన్ని సౌకర్యాలు కొరవడడంతో నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్‌తో డిసెంబరు 2004 లో ఆడాడు.,, శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.
పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
నరేంద్ర మోదీ స్టేడియం (గతంలో మోటెరా స్టేడియం) అనేది భారతదేశంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది 132,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం . గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉంది మరియు ఇది టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ20 ఇంటర్నేషనల్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
తొక్కిసలాట లేదా తోపులాట (stampede) మందలుగా తిరిగే జంతువులలో (మనుషులలో కూడా) ఒకవిధమైన స్పందన మూలంగా అన్ని జంతువులూ ఒకేసారిగా నిర్ధిష్టమైన లక్ష్యం లేకుండా పరుగులెత్తడం మొదలుపెడతాయి. ఇవి కొన్ని సందర్భాలలో తమను తాము నాశనం చేసుకుంటాయి; మరికొన్ని సార్లు అడ్డం వచ్చిన మనుషుల్ని లేదా వారి ఆస్తుల్ని నాశనం చేస్తాయి. ఇవి మెదడు, వినాళ గ్రంథుల వలన ప్రేరేపించబడి ఈ విధంగా ప్రవర్తిస్తాయని భావిస్తారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం. ఇది హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది.