The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి యొక్క స్థితి కర్త, లయ కర్త , సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు.
ఆస్తులు అంతస్తులు (1969 సినిమా)
అయోమయ నివృత్తి పేజీ ఆస్తులు అంతస్తులు చూడండి. ఆస్తులు అంతస్తులు1969 మే 15న విడుదలైన సాంఘిక చలనచిత్రం.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి 10 లోపల జరిగిన భారతీయ సైనిక చర్య. ఇది పంజాబ్ లోని అమృత్సర్ లోగల హర్మందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) కాంప్లెక్స్ నుంచి సిఖ్ దాందానీ తక్సల్ నాయకుడైన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే, అతని అనుచరులను బయటకు రప్పించడానికి చేసిన చర్య. అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరా గాంధీ ఈ చర్యకు ఆదేశించింది.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగుస్తాయి. రోజుకో నిర్దిష్ట కార్యక్రమంతో తొమ్మిది సంవత్సరాలలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా శాఖల వారీగా ప్రగతి నివేదికలు, కరపత్రాలను రూపొందిస్తున్నారు.
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా మెక్సికోలో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
బాల కార్మికులు (ఆంగ్లం: Child labour) 18 సంవత్సరాల లోపు, సాధారణ పాఠశాలలో చేరి చదువుకోవాల్సిన వయసు సామర్థ్యానికి ఆటంకం కలిగించే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా హాని కలిగించే ఈ విధమైన పని ద్వారా పిల్లల శ్రమ దోపిడీ చేయడాన్ని బాల కార్మికుల వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల చట్టంచేసి ఇటువంటి దోపిడీని నిషేధించారు, అయినప్పటికీ ఈ చట్టాలు పిల్లలందరి పనిని బాల కార్మికులుగా పరిగణించవు. మినహాయింపులలో బాల కళాకారుల పని, కుటుంబ విధులు, పర్యవేక్షించబడిన శిక్షణ అమిష్ పిల్లలు, అలాగే అమెరికాలోని స్వదేశీ పిల్లలు అభ్యసించే కొన్ని రకాల పిల్లల పని.బాల కార్మికులు చరిత్ర అంతటా వివిధ స్థాయిలలో ఉన్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చరు రాడార్ (NISAR) మిషన్ ద్వంద్వ-పౌనఃపున్యం కలిగిన సింథటిక్ ఎపర్చరు రాడార్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, దాన్ని భూ పరిశీలన ఉపగ్రహంపై ఉంచి అంతరిక్షం లోకి ప్రయోగించడానికీ నాసా ఇస్రోలు ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు. ద్వంద్వ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించే మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈ ఉపగ్రహం గుర్తింపు పొందుతుంది. ఇది రిమోట్ సెన్సింగ్ కోసం, భూమిపై సహజ ప్రక్రియలను గమనించడానికీ, అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ (ఆంగ్లం: The Elephant Whisperers) అనేది అనాథ ఏనుగులను సంరక్షించే ఓ దంపతుల వాస్తవ జీవన ఆధారంగా 2022లో రూపొందించిన భారతీయ లఘుచిత్రం. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రానికి తన మొదటి ప్రయత్నంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించింది. సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం 2022 నవంబరు 9న అమెరికాలోని డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన డాక్ ఎన్వైసి(Doc NYC) లో ప్రదర్శించబడింది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
విద్యుదయస్కాంతం ద్వారా స్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపి ఉక్కు తీగ లేదా టేప్ పై శబ్ద తరంగాలను రికార్డు చేసి ఆ టేప్ నుండి సమాచారాన్ని మరలా గ్రహించుటకు వాడే పరికరాన్ని టేప్ రికార్డరు అంటారు. ఈ టేప్ రికార్డులో ఉపయోగించే టేప్ కలిగిన దీర్ఘచతురస్రాకార పరికరాన్ని క్యాసెట్టు అంటారు. టేప్ పై ధ్వనిని రికార్డు చేయవచ్చు, ఆ ధ్వనిని టేప్ రికార్డరులో ఉపయోగించు మరల వినవచ్చు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.