The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 21న విడుదలైంది.
తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామం గా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడింది ఒక నివాస ప్రాంతం.దీనిని కూడా గ్రామం అని వ్యవహరిస్తారు.
తెలంగాణ రైతుబీమా పథకం, తెలంగాణ రాష్ట్ర రైతులకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే, నామినీకి ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో రైతు కోసం 2,271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తోంది.
బిచ్చగాడు 2 అనేది విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా చిత్రం. విజయ్ ఆంటోని బిచ్చగాడు తెలుగులో భారీ విజయాన్ని సాధించింది .విజయ్ ఆంటోని బిచ్చగాడు 6వ వార్షికోత్సవం సందర్భంగా దాని సీక్వెల్‌తో రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇన్నేళ్ల తర్వాత విజయ్ ఆంటోని ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నాడు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
రైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకుగాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం
హైదరాబాదు విమోచనోద్యమం తర్వతా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత 1951 హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితంగా, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ మంత్రివర్గం 1952 నుండి 1956 నవంబరు 1న హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేదాకా పనిచేసింది.
కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) అతి పెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు.
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి. జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.
కాలెండరు, లేదా క్యాలెండరు (ఆంగ్లం: క్యాలెండర్) అనగా, సంవత్సరంలో అన్ని రోజులు, వారాలు, నెలలు కాలాన్ని చూపించే ముద్రిత పట్టికను క్యాలెండరు అని అంటారు.అయితే ప్రస్తుత సాంకేతిక యుగాలలో పుస్తక రూపం కాకుండా వివిధరూపాలలో తయారవుతుంది.దీనిని సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది.దీనిలో కాలం, దినములు, వారములు, నెలలు,, సంవత్సరములు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినం' అని సంబోధిస్తారు. అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి, వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి.ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు.కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు అకాడమిక్ కేలండర్, కోర్టు కేలండర్.).
బండిపోర్ లేదా బండిపోరా భారతదేశం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని బండిపోరా జిల్లాకు ప్రధాన కేంద్రస్థానం.ఇది ఆసియాలో రెండవ అతిపెద్ద మంచినీటి వులర్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉంది.శ్రీనగర్‌లోని నిషాత్ బాగ్ మాదిరిగానే బండిపోరాలో చప్పరం తోట ఉంది.బండిపోరా మూడు వైపులా పర్వతాలతో, నాల్గవ వైపు వూలర్ సరస్సుతో నిర్మించారు.బండిపోరా మూడు 'ఎ' లకు అనగా అలీమ్ (జ్ఞానం),అడాబ్ (మంచి అలవాట్లు లేదా సాహిత్యం),ఆబ్ (నీరు)లకు ప్రసిద్ధి చెందింది.జానపద కథల నుండి తెలిసినట్లుగా,బండిపోరా పేరు బండ్ ఆఫ్ వులర్ నుండి,బండ్ ఇ పూర్ గా, స్థానిక జానపద గానం బృందాల నుండి (బాడ్) బాండ్ ఇ పూర్ గా లేదా పరివేష్టిత (బ్యాండ్) భౌగోళిక స్థానం నుండి బంద్ ఇ పూర్ గా రూపాంతరం చెందింది.
ఉర్జిత్ పటేల్ ( 1963 అక్టోబరు 18) ఒక భారతీయ ఆర్థికవేత్త, బ్యాంకర్,, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా ఉన్నపుడు ద్రవ్య విధానం, ఆర్థిక విధానాలపై పరిశోధన, గణాంకాలు, సమాచార నిర్వహణ, బీమా డిపాజిట్లు, సమాచార హక్కు లాంటి అంశాలు చూసుకునే వాడు. 2016 ఆగస్టు 20 న భారత ప్రభుత్వం రఘురాం రాజన్ తరువాత రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉర్జిత్ పటేల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒడిశా (ఒరియా: ଓଡ଼ିଶା) ( పాత పేరు ఒరిస్సా) తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం . దీనికి ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నాయి. ఇది విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రం.