The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.
బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని 'మైక్రోఫైలేరియా' క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి.
భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం "జాతీయ వైద్యుల దినోత్సవం" (ఆంగ్లం: National Doctors' Day) జూలై 1 న జరుపుకుంటారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ (1882 జూలై 1-1962 జూలై 1) జయంతి (,వర్ధంతి) జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1, 1882 న జన్మించాడు 1962 లో అదే తేదీన మరణించాడు.80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది.గ్రీటింగ్ కార్డులు, పుష్పం ఏర్పాట్లు రోగులు వైద్యులు గ్రీటింగ్ సహా ఈ రోజు గమనించవచ్చు పలు మార్గాలు ఉన్నాయి.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి (ఆంగ్లం: Guru Purnima) అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
మేమ్ ఫేమస్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమాకు సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించగా కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మంత్రి మల్లారెడ్డి మార్చి 26న ఆవిష్కరించగా, సినిమాను మే 26న విడుదలై, జూన్ 30 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
How many members are therein in khilafat committee ??ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యం పై బ్రిటిష్ ప్రభుత్వం దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్రభావం ఎంత వరకు ఉండినదంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైపోయింది.
తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించబడిన ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగిసాయి. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించాడు.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
మూస:భారత సంవిధానం.rk 1 వ భాగం: సమన్వయ భారతం: 1 వ అధికరణ: దేశనామము, సమన్వయ భారత పరధి 2 వ అధికరణ: నూతన రాష్ట్రాల స్థాపించుట, చేర్చుకొనుట 2 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడింది. 3 వ అధికరణ: నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడున్న రాష్ట్రా పరిధులు, విస్తీర్ణముల మార్పూ 4 వ అధికరణ: 2,3 లకు ఉపయుక్తమైనవి, ఆవశ్యకమైనవి, అనుసంబవమైన మార్పూలు; ఒకటి, నాలుగు షెడ్యూలులో మార్పులు. {{2 వ భాగం : పౌరసత్వం}} 5 వ అధికరణ: ఈ సంవిధానం ప్రారంభంనాటి పౌరసత్వం 6 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
భారతదేశంలో బహుళ-పార్టీ వ్యవస్థ ఉంది. భారత ఎన్నికల సంఘం (ECI) జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ రిజర్వు చేయబడిన పార్టీ చిహ్నం, ప్రభుత్వ టెలివిజన్ మరియు రేడియోలో ఉచిత ప్రసార సమయం, ఎన్నికల తేదీల సెట్టింగ్‌లో సంప్రదింపులు మరియు ఎన్నికల నియమాలు మరియు నిబంధనలను సెట్ చేయడంలో ఇన్పుట్ ఇవ్వడం వంటి అధికారాలను పొందుతుంది.
బ్రిటీషు రెసిడెన్సీ, హైదరాబాదు
బ్రిటీషు రెసిడెన్సీ (హైదరాబాదు రెసిడెన్సీ, కోఠి రెసిడెన్సీ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న భవనం. 1798లో నిర్మించబడిన ఈ భవనం, ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం గ్రామం కొరకు చూడండి.) ఆలంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి.
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా
భారతదేశంలో ఒకపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థకు (ఐ.ఎన్.సి) అత్యున్నత ఆధిపత్యం వహించే వ్యక్తిని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అని వ్యవహరిస్తారు. రాజ్యాంగపరంగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడినిఎన్నుకుంటారు. పైన పేర్కొన్న అధ్యక్షుడి మరణం లేదా రాజీనామా వంటి ఏదైనా కారణంవల్ల అత్యవసరం సంభవించినట్లయితే, కార్యనిర్వాహక సంఘం ఒక తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే వరకు అత్యంత సీనియర్ జనరల్ సెక్రటరీ అధ్యక్షుడి ఎఐసిసి ద్వారా సాధారణ విధులను నిర్వహిస్తాడు.