The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి 1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనేది ఫిబ్రవరి 2020లో భారత ప్రభుత్వంచే అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడిన ట్రస్ట్. ఈ ట్రస్ట్ 15 మంది ట్రస్టీలను కూడి ఉంది.
2019 అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
అయోధ్య వివాదంలో తుది తీర్పును భారత సుప్రీంకోర్టు 9 నవంబర్ 2019న ప్రకటించింది. రామజన్మభూమిలో (హిందువుల ఆరాధ్య దైవం, రాముడి జన్మస్థలం) ఆలయాన్ని నిర్మించేందుకు వివాదాస్పద భూమిని (2.77 ఎకరాలు) ట్రస్టుకు (భారత ప్రభుత్వం సృష్టించే) అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదుకు బదులుగా మసీదు నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మరో స్థలంలో 5 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
జగద్గురు రామానందచార్య స్వామి రామభద్రాచార్య (జననం: గిరిధర్ మిశ్రాగా 1950 జనవరి14) భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, సంస్కృత పండితుడు, బహుభాషావేత్త, కవి, రచయిత, వచన వ్యాఖ్యాత, తత్వవేత్త, స్వరకర్త, గాయకుడు, నాటక రచయిత, కథా కళాకారుడు. ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందచార్యలలో అతను ఒకడు. 1988 నుండి ఈ పదవిని పొందారు.రామభద్రాచార్య తులసీదాసు పేరు మీద చిత్రకూట్ లో ఉన్న మత, సామాజిక సేవా సంస్థ తులసి పీఠ్ స్థాపకుడు, అధిపతి.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఆనందిబెన్ జేతాభాయి పటేల్ (జ.నవంబరు 21, 1941 ) 1998 నుండి భారతదేశం లోని గుజరాత్ రాష్ట్ర శాసనసభ్యులుగా ఉన్న రాజకీత వేత్త. ఆమె 1987 నుండి భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాశాఖ, డెసాస్టర్ మేనేజిమెంటు, ప్రధాన ప్రాజెక్టులు శాఖలకు మంత్రిగా ఉన్నారు.2014 భారత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ భారత పార్లమెంటుకు భా.జ.పా తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక అయినప్పటి నుండి ఆయన దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారంలో ఉన్న కాలంలో ఆమె గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రను సమర్ధవంతంగా పోషించారు.
సెక్యులరిజం (Secularism) అనేది ఒక 'స్వేచ్ఛాయుత ఆలోచన', దీని ప్రకారం, కొన్ని కార్యాచరణాలు లేదా సంస్థలు, మతము లేదా మతముల విశ్వాసాల నుండి వేరుగా యుంచుట. అనగా ప్రజల లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలనుండి లేదా మతపరమైన భావనలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్ భావాలను పెంపొందించుట. ఒక విధంగా చెప్పాలంటే, సెక్యులరిజం ప్రకారం, మతపరమైన చట్టాలు, ప్రబోధనలనుండి స్వేచ్ఛపొందడం.
వేదాల ననుసరించి యుగాలు నాలుగు.నాలుగు యుగాలలో త్రేతా యుగం రెండవది ఈ యుగంలో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు.ఈ యుగం పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరాలు. ఇందు ధర్మం మూడు పాదములపై నడుస్తుంది.వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగం ప్రారంభమైంది.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
సానియా మీర్జా (జననం:1986 నవంబరు 15) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది.
హను మాన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
బాబరు (ఆంగ్లం : Babur), (ఫిబ్రవరి 14, 1483 - డిిిిిిిిసెంబర్ ,26 1530). (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ) ; ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
సత్య యుగం (సంస్కృత: सत्ययुग), హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు. "సత్య యుగం (యుగము లేదా యుగం)", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది.