The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
విశ్వం 2024లో విడుదలైన తెలుగు సినిమా. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వేణు దోనెపూడి, ప్రభాకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 16న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి, అక్టోబర్ 11న విడుదలైంది.
గోకరకొండ నాగసాయిబాబా (1967 - 2024 అక్టోబరు 12) భారతీయ పండితుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేసాడు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆయనను 2017లో జైలులో నిర్బంధించగా, 2024లో నిర్దోషి అని తేలడంతో విడుదల చేసారు.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
దేవర 2024లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన మహాలక్ష్మి దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.మహాలక్ష్మి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత మహాలక్ష్మి దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
సిమి గరేవాల్ (ఆంగ్లం: Simi Garewal; జననం సిమ్రితా గరేవాల్; 1940 అక్టోబరు 17) భారతీయ సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత & టాక్ షో హోస్ట్. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది. ఆమె దో బదన్ (1966), సాథీ (1968), మేరా నామ్ జోకర్ (1970), సిద్ధార్థ (1972), కర్జ్ (1980) & ఉదీకాన్ (పంజాబీ చిత్రం) లాంటి హిట్ సినిమాలలో నటించింది.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal () (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (The Tata Group ) జమ్షెడ్జీ టాటా(జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా) చే 1868 సంవత్సర లో స్థాపించబడిన భారతదేశం లోని పూర్వ కంపెనీ లలో ఒకటి. ఈ సంస్థను ఆరు ఖండాలలో 100కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీస్ కు రెండు మిలియన్లకు పైగా వాటాదారులు, సుమారు విలువ $ 57.7 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
టాటా గ్రూప్ ఛైర్మనుగా రతన్ టాటా నిష్క్రమించిన తదుపరి ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ (1968 జులై 4 - 2022 సెప్టెంబరు 4) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టినట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు.
లకుముకి పిట్ట ( ఆంగ్లము Kingfisher) అందమైన రంగుల పక్షి.ఇవి అందమైన రంగురంగుల పక్షులజాతికి (కొరాసిఫార్మ్స్) చెందింది. ఇవి లేత, మధ్య తరహా నుండి ముదురు రంగులతో అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగానూ ఉంటాయి.ఇవి ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తుంది కింగ్ ఫిషర్లు జాతులలో సుమారు 90 రకాలు ఉన్నట్లు తెసుస్తుంది.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో, నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు.