The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారతదేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ
1920ల్లో ప్రారంభించి 1945-47 వరకూ జవాహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్యోద్యమంలో వహించిన పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కావడంతో పాటుగా కేంబ్రిడ్జిలో చదువుకున్న రోజుల్లోనే వలసవాద వ్యతిరేకత మొగ్గతొడిగింది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
జనక అయితే గనక 2024లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించాడు. సుహాస్, సంగీర్తన విపిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 4న, ట్రైలర్‌ను ఆగష్టు 27న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 12న విడుదలైంది.
విప్, అనేది రాజకీయ పార్టీలలో అధికారికంగా నియమించిన వ్యక్తి సంబంధించిన పదం. ఆ హోదాలో ఉన్న వ్యక్తి లేదా అధికారి శాసనసభలో సంబందిత పార్టీ క్రమశిక్షణను పర్వేక్షించటం, నిర్ధారించడం అతని ముఖ్య బాధ్యత. దీనర్థం, పార్టీ సభ్యులు వారి స్వంత వ్యక్తిగత భావజాలం లేదా వారి నియోజకవర్గాల వ్యతిరేఖ పార్టీ ప్రభావంతో వారి ఇష్టానుసారం కాకుండా పార్టీ నియమాల ప్రకారం ఓటు వేస్తారని నిర్ధారించుకోవడం.విప్‌లు పార్టీ "అమలుదారులు".తమ తోటి రాజకీయ పార్టీ శాసనసభ్యులు ఓటింగ్ సెషన్లకు హాజరయ్యేలా, తమ పార్టీ అధికారిక విధానం ప్రకారం ఓటు వేయడానికి వారు పని చేస్తారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
మట్కా 2024లో విడుదలైన తెలుగు సినిమా. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 5న, ట్రైలర్‌ను నవంబర్ 2న చిరంజీవి చేతులమీదుగా విడుదల చేయగా, నవంబర్ 14న సినిమా విడుదలైంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
డి.కె.ఆదికేశవులు నాయుుడు (D. K. Adikesavulu Naidu) (జ: 1 జూలై, 1941) 14వ లోక్‌సభ సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. డీకే ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం టీడీపీలో చేరి 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచాడు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు (అమెరికా, సోవియట్ రష్యా) ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
జితేందర్ రెడ్డి (2024 తెలుగు సినిమా)
జితేందర్ రెడ్డి 2024లో విడుదలైన తెలుగు సినిమా. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహించాడు. రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 8న విడుదలైంది.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.
పూర్ణ స్వరాజ్ లేక భారత స్వాతంత్ర్య ప్రకటన అన్నది 1929 డిసెంబరు 19న బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి అన్ని విధాలా తెగతెంపులు చేసుకునే పూర్ణ స్వరాజ్యం లేక పూర్తి స్వయం పరిపాలన సాధించేందుకు పోరాటం చేయనున్నట్టు భారత జాతీయ కాంగ్రెస్ చేసిన తీర్మానం. లాహోర్ కాంగ్రెస్‌లో ఈ తీర్మానం ఆమోదమైంది. 1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal () (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.