The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న ఎన్నికలు జరగగా 65.1 శాతం పోలింగ్ నమోదైంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
ఏక్నాథ్ షిండే, మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. షిండే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు. రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిగా, అతను మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్ రాకేశ్ నిర్మించిన ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు. రాకింగ్ రాకేశ్, అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న విడుదల చేసి, సినిమా నవంబర్ 22న విడుదలైంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అజిత్ పవార్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. అజిత్ పవార్ 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా పని చేసి 2023 జూన్ 2న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసి అదే రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు అధిపతి. శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, గవర్నరు అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తాడు. నియమితుడు మహారాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడు కానట్లయితే, వారు ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎన్నుకోబడాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
ఈజిప్టు, అధికారికనామం ఈజిప్టు అరబ్బి గణతంత్రం, ( ˈiː.dʒɪpt , ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్), ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి.
జనక అయితే గనక 2024లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించాడు. సుహాస్, సంగీర్తన విపిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 4న, ట్రైలర్‌ను ఆగష్టు 27న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 12న విడుదలైంది.
ఇథియోపియా అధికారిక నామం "ఇథియోపియా బహుకేంద్రక ప్రజాస్వామ్య గణతంత్రం" ఒక భూపరివేష్టిత దేశం,ఆఫ్రికా ఖండంలో ఈశాన్యంలో ఉంది. దీని ఉత్తరసరిహద్దులో ఎరిత్రియా, పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో కెన్యా, తూర్పుసరిహద్దులో సోమాలియా, ఈశాన్యసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దేశవైశాల్యం 11,00,000 చ.కి.మీ.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
మహారాష్ట్రలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
మహారాష్ట్ర నుండి 18వ లోక్‌సభకు 48 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 ఏప్రిల్ 19 - 2024 మే 20 మధ్య ఐదు దశల్లో మహారాష్ట్రలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూలు2024 మార్చి 16న, భారత ఎన్నికల సంఘం 2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది, మహారాష్ట్రలో మొదటి ఐదు దశల్లో 2024 ఏప్రిల్ 19, 26 , మే, 7, 13, 20 తేదీల్లో ఓటు వేయాల్సి ఉంది. మహారాష్ట్ర పరిధిలో 48 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఉద్ధవ్ బాల్ థాకరే, (జననం:1960 జూలై 27) మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబరు 28 నుండి, 2022 జూన్ 30 వరకు పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2020 నుండి మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు, 2019 నుండి మహా వికాస్ అఘాడి పార్టీ అధ్యక్షుడు, 2022 నుండి శివసేన (యుబిటి) అధ్యక్షుడు. 2013 నుండి 2022 వరకు శివసేన, 2003 నుండి 2013 వరకు వర్కింగ్ ప్రెసిడెంటుగా 2006 నుండి 2019 వరకు సామ్నా ఎడిటర్-ఇన్-చీఫ్ గా పనిచేసాడు.
బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( బిఆర్ నాయుడుగా సుపరిచితుడు.) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నాయుడుకు అవకాశం కల్పించారు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు, (ఆంగ్లం: Directive Principles). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?
కబడ్డీ (చెడుగుడు) ఒక స్పర్శాగత జట్టు ఆట. జుట్టుకు ఏడుగురు ఆటగాళ్ళుంటారు. ఆట లక్ష్యం "రైడర్"గా పిలువబడే స్పర్ధి, కోర్టులోని ప్రత్యర్థి జట్టు భాగంలోకి కబడ్డీ, కబడ్డీ అని శ్వాసతీసుకోకుండా పలుకుతూ అవతల జట్టుభాగంలోకి వెళ్లి, వీలైనంత ఎక్కువ మందిని తాకడం, వారి పట్టుకోబోతే తప్పించుకుని స్వంత జట్టు భాగంలోకి తిరిగి రావడం.
ఉజ్బెకిస్తాన్ గణతంత్రం (Republic of Uzbekistan) మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం (నలువైపులా భూమితో చుట్టబడిన దేశము). ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు గొక్తర్స్ (టర్కిక్ ఖగ్నాటే), తరువాత తింరుద్ సామ్రాజ్యం భాగంగా ఉండేది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి భారతదేశం, జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్య నిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రానికి ఒక గవర్నరు, ఒక రాష్ట్ర న్యాయమూర్తి అధిపతి. అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది.శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా పార్టీని (లేదా సంకీర్ణాన్ని) మెజారిటీ సభ్యులుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.దాని ప్రకారం గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తారు.మంత్రుల మండలి అసెంబ్లీకి సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమిపై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.