The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆర్మీనియన్ భాష : Հայաստան, "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం ల మధ్య ఉంది. ఈ దేశం తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల నడుమ ఉంది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఇరాన్, అజర్బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్క్లేవ్లు ఉన్నాయి.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
మరపురాని కథ 1967, జూలై 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. 1964లో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా విడుదలైన కై కొడుత్త దైవమ్ తమిళ సినిమా నుండి ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమా 1970లో మలయాళంలో ప్రేమ్ నజీర్, పద్మిని, సత్యన్, జయభారతి ప్రధాన తారాగణంగా పలుంకు పాత్రమ్ అనే పేరుతో, 1971లో అమితాబ్ బచ్చన్, తనూజ జంటగా ప్యార్ కీ కహానీ పేరుతోను రీమేక్ చేయబడింది.
ఆంటిగ్వా, బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న రెండు ద్వీపాల కలిగిన దేశం. ఇది కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం మద్యన ఉంది. ఇందులో ఉత్తర అమెరికా ఖండానికి చెందిన 'ఆంటిగ్వా, బార్బుడా అనే రెండు మానవనివాసిత ద్వీపాలు, పలు ఇతర ద్వీపాలు (గ్రేట్ బర్డ్స్, గ్రీన్, గునియా, లాంగ్, మైదెన్, యోర్క్ ఐలాండ్ దక్షిణతీరంలో రెడోండా ) ఉన్నాయి.
లక్కీ భాస్కర్ 2024లో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 11న, ట్రైలర్‌ను అక్టోబర్ 21న విడుదల చేసి, సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్ రాకేశ్ నిర్మించిన ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు. రాకింగ్ రాకేశ్, అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న విడుదల చేసి, సినిమా నవంబర్ 22న విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 జూన్ 2 నుండి, 13 జిల్లాలతో కొనసాగింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం, తన మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2022 ఏప్రిల్ 4 నుండి ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలగా పునర్వ్యస్థీకరించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో 2024లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 11న, ట్రైలర్‌ను అక్టోబర్ న విడుదల చేసి, నవంబర్ 8న విడుదలైంది.
అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరులో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.
కబడ్డీ (చెడుగుడు) ఒక స్పర్శాగత జట్టు ఆట. జుట్టుకు ఏడుగురు ఆటగాళ్ళుంటారు. ఆట లక్ష్యం "రైడర్"గా పిలువబడే స్పర్ధి, కోర్టులోని ప్రత్యర్థి జట్టు భాగంలోకి కబడ్డీ, కబడ్డీ అని శ్వాసతీసుకోకుండా పలుకుతూ అవతల జట్టుభాగంలోకి వెళ్లి, వీలైనంత ఎక్కువ మందిని తాకడం, వారి పట్టుకోబోతే తప్పించుకుని స్వంత జట్టు భాగంలోకి తిరిగి రావడం.
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మహమ్మద్ అబ్దుస్ సలం (పంజాబీ, Urdu: محمد عبد السلام; pronounced [əbd̪ʊs səlɑm]; 29 జనవరి 1926 – 21 నవంబర్ 1996), పాకిస్తానీ సిద్ధాంత భౌతికశాస్త్రవేత్త. 20వ శతాబ్ది సిద్ధాంత భౌతిక శాస్త్ర రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎలక్ట్రోవీక్ యూనిఫికేషన్ సిద్ధాంతం విషయమై చేసిన కృషికి షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి పంచుకున్నారు. అబ్దుస్ సలం నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి పాకిస్తానీయుడు, సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం, ఏ విభాగంలోనైనా ఇస్లామిక్ దేశం నుంచి నోబెల్ అందుకున్నవారిలో రెండవవారు (మొదటి వ్యక్తి ఈజిప్టు నుంచి అన్వర్ సాదత్).
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. 2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.