The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)
జాకిర్ హుసేన్ (మార్చి 9, 1951 - డిసెంబరు 15, 2024) ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ అందజేసింది. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
ఆంధ్ర మహాసభ (IAST: ''Andhra Mahasabha'') నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతపు తెలుగువారు ప్రారంభించిన సంఘం. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 1920వ దశకం చివర్లో మాడపాటి హనుమంతరావు నేతృత్వములో తెలుగు ప్రజలు సంఘటితమై ఒక సంఘముగా ఏర్పడి 1930 నుండి 1945 వరకు 13 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
70వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు.
అనుర కుమార దిసనాయకే శ్రీలంక రాజకీయ నాయకుడు, 1968 నవంబర్ 24న అనురాధపురం జిల్లాలోని తంబుతెగామ ప్రాంతంలో జన్మించాడు.2019లో మాజీ అధ్యక్ష అభ్యర్థి, అతను 2024 శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు నేషనల్ పీపుల్స్ పవర్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యాడు.అతను కొలంబో జిల్లాకు పార్లమెంటు సభ్యుడుఇంకా జనతా విముక్తి పెరమున (2004 నుండి) , నేషనల్ పీపుల్స్ పవర్ (2019 నుండి) ప్రస్తుత పార్టీ నాయకుడు..
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
నారీ శక్తి వందన్ అధినియమ్ (ఆంగ్లం: Nari Shakti Vandan Adhiniyam) అనేది లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు. నారీ శక్తి వందన్ అధినియమ్ రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023కు అధికారిక పేరు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబరు 19న భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
బహుళ భాషా ప్రాంతమైన తూర్పు పంజాబ్ లో పంజాబీ సంఖ్యాధిక్య సుబా (రాష్ట్రం)ను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో 1950ల్లో సాగిన ఉద్యమమే పంజాబీ సుబా ఉద్యమం. దీన్ని అకాలీ దళ్ పార్టీ నడిపించింది, ఉద్యమం వెనుక ప్రధానంగా మాస్టర్ తారాసింగ్, ఫతే సింగ్ వంటివారు ఉన్నారు. ఈ ఉద్యమ ఫలితంగా పంజాబీ సంఖ్యాధిక్య పంజాబ్ రాష్ట్రం, హిందీ సంఖ్యాధిక్య హర్యానా రాష్ట్రం, ఛండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పడ్డాయి.
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాలంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) అనేవి, 2030 నాటికి ప్రపంచంలోని బహుముఖ రంగాలలో పేదరికాన్ని రూపు మాపడానికి, సమస్త విశ్వ శ్రేయోసమృద్ధి కోసం ఒక సమానమైన, న్యాయమైన, సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడానికై తీసుకొన్న ఒక దృఢమైన, సార్వత్రిక ఒప్పందము. మన ప్రపంచమును రూపాంతరం చేయుటలో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 169 నిర్దేశిత లక్ష్యాలు ఒక భాగం. సుస్థిర అభివృద్ధి కొరకు 2030 ఎజెండా, 2015 సెప్టెంబరులో జరిగిన చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమ్మేళనంలో 193 సభ్యరాజ్యాలచే స్వీకరించబడి, 2016, జనవరి 1 వ తేదీ నుండి అమలులోనికి వచ్చింది.
పుష్ప 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్, రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదలైంది.
భారత కేంద్ర బడ్జెట్ 2024, అనేది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్. దీంతో ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టయింది. ఇది భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని కాని, మధ్యంతర బడ్జెట్ (interim Budget) అని కాని వ్యవహరిస్తారు.
వీధి నాటకం అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. ఈ ప్రదర్శనా ప్రాంతాలు షాపింగ్ కేంద్రాలు, కారుపార్కులు, వినోద కేంద్రాలు, కళాశాల లేదా విశ్వవిద్యాలయ క్యాంపస్ లు, వీధిలో బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావచ్చు. ఈ ప్రదర్శనకారులు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహం గల ప్రాంతాలలో ప్రదర్శనలిస్తుంటారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2024 ఫిబ్రవరి 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం స్థాపించబడిన భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. స్వయంప్రతిపత్త సంస్థలు, ప్రభుత్వం గణనీయంగా నిధులు సమకూర్చే కార్పొరేషన్లతో సహా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రసీదులు, వ్యయాలను ఆడిట్ చేయడానికి వారికి అధికారం ఉంది.కాగ్ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ల చట్టబద్ధమైన ఆడిటర్ కూడా, ప్రభుత్వం కనీసం 51 శాతం ఈక్విటీ వాటా లేదా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ కంపెనీల అనుబంధ కంపెనీలను కలిగి ఉన్న ప్రభుత్వ కంపెనీల అనుబంధ ఆడిట్‌ను నిర్వహిస్తుంది.కాగ్ లోక్‌పాల్ చట్టబద్ధమైన ఆడిటర్ కూడా. కాగ్ నివేదికలు పార్లమెంటు/లెజిస్లేచర్ల ముందు ఉంచబడ్డాయి, భారత పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేక కమిటీలు అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు (PACలు), పబ్లిక్ అండర్‌టేకింగ్‌లపై కమిటీలు (COPUలు) చర్చకు తీసుకోబడతాయి .
నోబెల్ బహుమతి పొందిన భారతీయులు
1901లో తొలిసారిగా స్థాపించబడిన నోబెల్ బహుమతిని 2018 సంవత్సరంలో మొత్తం 904 మంది వ్యక్తులుకు, (వారిలో 852 మంది పురుషులు, 52 మంది మహిళలు) 24 సంస్థలకు అందించారు. గ్రహీతలలో 11 మంది భారతీయులు ( వారిలో నలుగురు భారతీయ పౌరులు, ఏడుగురు భారతీయ పూర్వీకులు లేదా వారి నివాసులు). రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పురస్కారం పొందిన మొదటి భారతీయ పౌరుడు.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది. 1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.
1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది.
హరికథ 2024లో విడుదలైన మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సిరీస్‌కు మ్యాగీ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, దివి వడ్త్యా, శ్రీరామ్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నవంబర్ 22న విడుదల చేయగా, వెబ్ సిరీస్ డిసెంబర్ 13న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఆరు ఎపిసోడ్స్ తో తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ భాషల్లో విడుదలైంది.