The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలకానున్న సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
'వచ్చిన కోడలు నచ్చింది'తెలుగు చలనచిత్రం1959 అక్టోబర్16 న విడుదల.సుధాకర్ ఫిలింస్ పతాకంపై పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జూలూరి జమున, పసుపులేటి కన్నాంబ, చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించిన ఈ చిత్రo , దాసరి యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన అతను కంఠం కారణంగా అతను "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
మదగమగమగే దాసున్ షనక, శ్రీలంక క్రికెటర్, శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే మ్యాచ్ ల కెప్టెన్. ఆల్ రౌండర్ అయిన దాసున్, కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తున్నాడు. 2019లో పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ఇతని కెప్టెన్సీలో శ్రీలంక సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత. 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ "అయే లైలా" తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ [V] వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.