The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.
'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 12) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. అతను అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 9న జరుపుకుంటారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
జయ జయహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం.ఈ గీతాన్ని అందెశ్రీ రచన చేశాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన 'జయ జయహే తెలంగాణ' గీతం 9 చరణాలతో రాష్ట్ర గీతం ఉంటుంది. పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొక రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ , ఎంఎం కీరవాణి రూపొందించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
పుష్ప 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్, రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదలైంది.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం), ఇది భారత పార్లమెంటు ఎగువ సభ. ఆంధ్రప్రదేశ్ 11 స్థానాలను ఎన్నుకుంటుంది. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడతారు.
వృద్దాప్యము లేదా ముసలితనము (ఆంగ్లం: Old age) మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమముగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను, వ్యాధులను పరిశోధించే విభాగాన్ని జీరియాట్రిక్స్ (Geriatrics) అంటారు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
నాగ చైతన్య (జననం: 1986 నవంబరు 23) నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
లక్కీ భాస్కర్ 2024లో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 11న, ట్రైలర్‌ను అక్టోబర్ 21న విడుదల చేసి, సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (ప్రస్తుత అనువాదం; మొదట 1978లో మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటనగా అనువదించబడింది, English: Universal Declaration of Human Rights యూనివర్సల్ ప్రకటన ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేదా UNDHR యూన్.డి.ఎచ్.ఆర్) ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం. 1948 డిసెంబరు 10 న ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని పలైస్ డి చైలోట్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడవ సెషన్లో తీర్మానం-217 గా దీన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలో అప్పటి 58 మంది సభ్యులలో, 48 మంది అనుకూలంగా ఓటు వేశారు.