The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
మేరీ ఆంటోనిట్టే 1755 నవంబరు 2న ఆస్ట్రియాలోని వియన్నాలో జన్మించారు. ఆమె ఎంప్రెస్ మరియా థెరిసా, ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాన్సిస్ I యొక్క చిన్న కుమార్తె. 1770లో, 14 సంవత్సరాల వయస్సులో, మేరీ ఆంటోయినెట్ లూయిస్-అగస్టేను వివాహం చేసుకుంది, కాబోయే ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI. ఆస్ట్రియా, ఫ్రాన్స్ మధ్య మైత్రిని బలోపేతం చేయడానికి వివాహం ఏర్పాటు చేయబడింది.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 డిసెంబర్ 4 - ఫిబ్రవరి 11, 1974) తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ( కృష్ణుడి గొప్ప ప్రేమకథ) హను రాఘవపుడి రచన, దర్శకత్వం వహించిన 2016 భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కింద రామ్ అచంతా, గోపిచంద్ ఆచంతా, అనిల్ సుంకర నిర్మించారు . కెవిపిజిలో నాని, మెహ్రీన్ పిర్జాడ ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ చిత్ర సమష్టి తారాగణం హరీష్ ఉతామన్, సంపత్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మజీ కీలక సహాయక పాత్రల్లో నటించారు.
ఈగల్ 2024లో తెలుగులో విడుదలకానున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. రవితేజ, అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్,నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 6న, ట్రైలర్‌ను డిసెంబర్ 20న విడుదల చేసి, సినిమాను సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న విడుదల చేయనున్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.