The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సయ్యద్ సోహెల్ (English: Syed Sohel; జననం 18 ఏప్రిల్ 1991) ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటుడు, మోడల్, నేపథ్య గాయకుడు, ఇతడు ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు. ఇతడు 2008లో కొత్త బంగారు లోకం చిత్రంలో గుర్తింపు లేని పాత్రతో తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు. 2013లో సంగీత మాయాజాలం చిత్రంలో ప్రధాన పాత్రలో తన సినీ రంగ ప్రవేశం చేశాడు.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు. భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
సైంధవ్ 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియోను ఆగష్టు 15న విడుదల చేశారు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది.