The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
పౌరసత్వ సవరణ బిల్లు (ఆంగ్లము:సిఏబి) ఇది 1955 పౌరసత్వ చట్టము నకు సవరణ తేవడానికి ఉద్దేశించిన బిల్లు. దీనిప్రకారము పాకిస్తాను, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ల నుండి భారత దేశానికి వలస వచ్చే ’ముస్లిమేతరలకు ’పౌరసత్వము ఇవ్వడానికి ఉద్దేసించినది. ఆయా దేశాలలో మతపరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి దేశములోనికి వచ్చేవారికనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మని ప్రవేశ పెడుతున్న అధికార పార్టీ వివరణ .
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
నెమురుగోమ్ముల సుధాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1999 నుండి 2004 వరకు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. తండ్రి చెన్నూర్ నియోజక వర్గం మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు, తల్లి చెన్నూర్ నియోజక వర్గం శాసనసభ్యురాలు నెమురుగోమ్ముల విమలాదేవిల పెద్ద కుమారుడు.డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు 2023 ఆగస్టు 14న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.
వంగా గీత (జననం 1964 మార్చి 1) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యింది. ఆమె ఇంతకుముందు పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, భారత పార్లమెంటు ఎగువ సభ లో తెలుగు దేశమ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి, సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 9 నుండి నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
తాలూకా (మండలం) భూమి, దానిపై వసూలు చేయవలసిన పన్నులుద్వారా సంక్రమించే ఆదాయాన్ని పర్వేక్షించే నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. ఈ వ్యవస్థ భారతదేశంలో స్వాతంత్ర్యం రాక ముందు పూర్వకాలం నుండి అమలులో ఉంది.తహసీల్దార్ విధులు నిర్వహించే కార్యాలయాన్నితహసీల్దార్ కార్యాలయం లేదా తాలూకా కార్యాలయం అంటారు. ఇతని పర్వేక్షణలో కొన్ని గ్రామాలు ఉంటాయి.వాటిని రెవెన్యూ గ్రామాలు అంటారు.భూ ఆదాయానికి సంబంధించి తహసీల్ నుంచి పన్నులు పొందే బాధ్యత వారిపై ఉంది.ఇది జిల్లా పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది.
కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్‌లో జీవితం గడిపాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
మమిత బైజు (జననం 2001 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ఆమె గెలుచుకుంది.
వినియోగదారుడు (Consumer) సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
గీతాంజలి 1948, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శ్యామల ఫిల్మ్స్ పతాకంపై జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్ నిర్మాణ సారథ్యంలో తంగిరాల హనుమంతరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరంజని, టంగుటూరి సూర్యకుమారి, పూర్ణిమ, జంధ్యాల గౌరీనాథశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. ప్రకాశరావు అందించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
రాజావారు రాణిగారు 2019లో విడుదలైన చిత్రం. ఎస్.ఎల్ ఎంటర్టైన్మెంట్స్ & మీడియా9 బ్యానర్ పై మనోవికాస్.డి, మనోజ్ నిర్మించిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజావారు రాణిగారు టీజర్‌ను 2019, నవంబర్ 18న విడుదల చేసి, సినిమాను నవంబర్ 29న విడుదల చేశారు.
బహుజన సమాజ్ పార్టీ నిర్మాత. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్పూర్ గ్రామంలోజన్మించాడు.జ్యోతిరావ్ ఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు.