The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఓం భీమ్ బుష్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న, ట్రైలర్‌ను న విడుదల చేసి సినిమాను మార్చి 22న విడుదల చేశారు.
బర్రెలక్కగా పేరొందిన కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
వంగా గీత (జననం 1964 మార్చి 1) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యింది. ఆమె ఇంతకుముందు పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, భారత పార్లమెంటు ఎగువ సభ లో తెలుగు దేశమ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది.
ఆపరేషన్ వాలెంటైన్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో సోనీపిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మించిన ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేసి, సినిమాను 2024 మార్చి 1న విడుదలై మార్చి 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి, సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 9 నుండి నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
జగ్గీ వాసుదేవ్, "సద్గురు" గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది.
సామజవరగమన 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, 2023 ఫిబ్రవరి 14న విడుదల చేసి, గ్లింప్స్ వీడియోను విష్ణు పుట్టినరోజు సందర్భంగా 2023 ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నపటికి.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి, ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢచార సంస్థ. ఈడీ భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో భాగం. దీనిలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లకు చెందిన అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు.ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.
'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' 2024లో విడుదలైన తెలుగు సినిమా. హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దరకత్వం వహించాడు. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 18న, ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 12న విడుదల చేసి సినిమాను మార్చి 1న విడుదల చేశారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.తెలుగు సినిమా హాస్యనటుడు గిరిబాబు చిన్న కుమారుడు బోస్ బాబు ఈ సినిమాలో కథానాయకునిగా నటించాడు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.