The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
ఓం భీమ్ బుష్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న, ట్రైలర్‌ను న విడుదల చేసి సినిమాను మార్చి 22న విడుదల చేశారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి, సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 9 నుండి నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆడే రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉన్న ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ జట్టు. తొలి ఎనిమిది ఐపిఎల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా 2008 లో స్థాపించబడిన ఈ జట్టు, జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొన్నిసార్లు ఐపిఎల్ యొక్క "మనీబాల్" జట్టుగా పరిగణిస్తారు.
ఈ వ్యాసం కారణం , హేతుబద్దత లాంటి తాత్విక విషయాలను గురించి విశ్లేషించి రచనలు చేసిన తత్వ వేత్తల గురించి. కారణం(హేతువు ) అనేది చైతన్య వంతంగా విషయాలను అర్టం చేసుకోవడం , తర్కంతో అన్వయించడం , అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అభ్యాసాలు చేయటం , నమ్మకాలను స్వీకరించటం లేదా సమర్తించడం . ఇది విలక్షణ మానవులు నిర్వహించే కార్య కలాపాలకు దగ్గర పోలిక కలిగి ఉంటుంది.
హోలికా దహనంను హోలికా అనే రాక్షసి బొమ్మ కాలుస్తూ జరుపుకుంటారు.హిందూధర్మం లోని అనేక సంప్రదాయాల ప్రకారం హోళిని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు.దాదాపు భారతదేశంలోని ప్రతి వాడలో హోళికా దహనం నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారం, ప్రజలు హోళికా దహనం కోసం ఒకటి లేదా రెండు చెక్క ముక్కలను అందజేస్తారు. ఇది హోలిక తన మేనల్లుడు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించిన అగ్నిలో కాల్చబడిందని సూచిస్తుంది.
సామజవరగమన 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, 2023 ఫిబ్రవరి 14న విడుదల చేసి, గ్లింప్స్ వీడియోను విష్ణు పుట్టినరోజు సందర్భంగా 2023 ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నపటికి.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, శ్రీరామునకు గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రి అందువలన భరతునకు తాతగా గుర్తిస్తారు.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' 2024లో విడుదలైన తెలుగు సినిమా. హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దరకత్వం వహించాడు. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 18న, ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 12న విడుదల చేసి సినిమాను మార్చి 1న విడుదల చేశారు.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి
ఉత్తమ నటి విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
సోవియట్ సమాఖ్య లేదా సోవియట్ యూనియన్ , అధికారికంగా సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య , సూక్ష్మ రూపం యు.ఎస్.ఎస్.ఆర్ (ఆంగ్లము USSR నుండి) ఇంకనూ సోవియట్ యూనియన్ (రష్యన్ లో Советский Союз ) ; (రోమనీకరణ : Sovetsky Soyuz), రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.