The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయా పిక్చర్స్ వారి ప్రత్యేకత. కథ కంటే కథనం మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
శివ సహస్రనామాలు శివుని పేర్లు "వెయ్యి పేర్లు జాబితా" ఉంది, హిందూమతం అత్యంత ముఖ్యమైన దేవతలలో శివుడు ఒకరు. హిందూ మతం సంప్రదాయంలోని సహస్రనామాలు ఒక రకం భక్తి శ్లోకం (సంస్కృతం: స్తోత్రం ), ఒక దేవత యొక్క అనేక పేర్లు, సహస్రనామములు జాబితా లోని పేర్లు దైవాన్ని ప్రశంసించినట్లు అవుతోంది, ఆ దైవం సంబంధం లక్షణాలు, విధులు, ప్రధాన పురాణాలలో ఒక కూలంకషంగా జాబితా (కేటలాగ్) ను అందిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రము వీటన్నింటి స్తోత్రరూపం.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త, సుప్రసిద్ద వ్యాపారవేత్త, భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఫోర్బ్స్‌లోకి ఎక్కగానే అకస్మాత్తుగా ఇవాళ ‘గ్రేట్ ఉమన్’ ఐపోలేదు నీతా అంబానీ.
ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి, సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదల కానుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
శరత్ కుమార్ రామనాథన్ (జననం 1954 జులై 14) భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు, విలేకరి, బాడీ బిల్డర్, దక్షిణ భారతదేశ నటీనటుల సంఘానికి మాజీ అధ్యక్షుడు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 130కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి అన్ని దక్షిణ భారతీయ భాషలే కాక రష్యన్ భాష కూడా తెలుసు.1986లో సమాజంలో స్త్రీ అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా కెరీర్ ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని నగరాలకు, పట్టణాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.