The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఓం భీమ్ బుష్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న, ట్రైలర్‌ను న విడుదల చేసి సినిమాను మార్చి 22న విడుదల చేశారు.
రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆడే రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉన్న ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ జట్టు. తొలి ఎనిమిది ఐపిఎల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా 2008 లో స్థాపించబడిన ఈ జట్టు, జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొన్నిసార్లు ఐపిఎల్ యొక్క "మనీబాల్" జట్టుగా పరిగణిస్తారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ఆమె గెలుచుకుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి చూపులు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది.ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఇది రెండు జాతీయ పురస్కారాలు సాధించింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచేస్తున్నారు.
ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి, సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 9 నుండి నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
సామజవరగమన 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, 2023 ఫిబ్రవరి 14న విడుదల చేసి, గ్లింప్స్ వీడియోను విష్ణు పుట్టినరోజు సందర్భంగా 2023 ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నపటికి.
తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
తెలంగాణలో తదుపరి భారత సాధారణ ఎన్నికలు 18వ లోక్‌సభకు 17 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మే 2024లో లేదా అంతకు ముందు జరగనున్నాయి.
సీతారాముల కళ్యాణం చూతము రారండీ
సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని సీతారామ కళ్యాణం (1961) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
అమర్ సింగ్ చంకీలా (21 జూలై, 1961 – 1988 మార్చి 8) ప్రముఖ పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.అతని అసలు పేరు ధనీ రాం.1988 మార్చి 8న చంకీలా,, అతని భార్య అమర్ జ్యోత్, అతని బృందంలోని మరో ఇద్దరిని కొంతమంది గుర్తు తెలియని యువకులు హత్య చేశారు. చంకీలా పంజాబ్‌లో బాగా వేదికల మీద పాడటంలో పేరొందిన గాయకుడు. అతని పాటల్లో ఎక్కువగా అతను పుట్టి పెరిగిన పంజాబ్ పల్లె వాసుల జీవన విధానం ఎక్కువగా కనబడుతూ ఉండేది.
మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము (Anthropology) మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం.. (గ్రీక్ భాష లో "Anthropos-" అంటే "మనిషి", "-logy" అంటే "శాస్త్రము" అని అర్థం). మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన భేదాలను కూడ తెలిపే సాంఘిక శాస్త్రం కూడా.
{{సినిమా| name = శ్రీరంగనీతులు | director = [[kodandarami reddy year = 1983| image=Sriranganeetulu.jpg| language = తెలుగు| production_company = అన్నపూర్ణ స్టూడియోస్| starring = అక్కినేని నాగేశ్వరరావు,శ్రీదేవి (నటి) , చలపతిరావు| }} శ్రీరంగనీతులు 1983 లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ లో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించారు. ఎ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.