The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగించుటకు ఏర్పడిన రాష్ట్ర కాబినెట్ చేత 2014 జూన్ 8న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట కాబినెట్ మంత్రుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూపబడ్డాయి.
పొంగూరు నారాయణ (జననం: జూన్ 15, 1956) ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ పదవి కన్నా ముందే ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా ఆయన తెలుగు ప్రజలకు చిరపరిచితం. విద్యారంగంలో పి.నారాయణ సాధించిన విజయాలు ఆయనలోని ఓ పార్శ్వాన్ని స్పృశిస్తే, ఇప్పుడు నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు నారాయణ లోని ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. ఎంచుకున్న రెండు రంగాల్లో అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూల పాన్పు కాదు.
కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతినగరం శాసనసభ్యుడు,రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, వాణిజ్యవేత్త, సాఫ్ట్ వేర్ నిపుణులు మరియు సంఘసేవకుడు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గజపతినగరం శాసనసభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. కొండపల్లి శ్రీనివాస్ 1982 ఏప్రిల్ 13న కొండపల్లి కొండలరావు, సుశీల దంపతులకు జన్మించారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15వ శాసనసభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన అధిపతి ముఖ్యమంత్రి తరువాత పదవి డిప్యూటి ముఖ్యమంత్రి పదవి. ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా 1959లో కె.వి.రంగారెడ్డి నియమితుడయ్యాడు.
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భారతదేశంలోని 28 రాష్ట్రాలుకు, కొన్నిసార్లు కేంద్రపాలిత ప్రాంతం (యుటి)లో ఎన్నికైన ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి. ప్రస్తుతం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి) పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ ఒక రాష్ట్రానికి అధిపతి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది.
భారత హోం వ్యవహారాల మంత్రి (లేదా హోమ్ మినిస్టర్) భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధిపతి. కేంద్ర మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. భారతదేశ అంతర్గత భద్రత నిర్వహణ హోం మంత్రి ప్రధాన బాధ్యతగా ఉంటుంది.దేశానికి చెందిన పెద్ద పోలీసు దళం దాని అధికార పరిధిలోకి వస్తుంది.హోమ్ మినిస్టరుకు అప్పుడప్పుడు, హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి, దిగువ స్థాయి హోం వ్యవహారాల సహాయ మంత్రి సహకారాలు అందిస్తారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అతనితో పాటు 5 ఉపముఖ్యమంత్రులు, 19 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.
పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం
పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గము. ఇది అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఇది షెడ్యూల్ జాతులకు రిజర్వ్ చేయబడింది.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ. దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు. ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రుల జాబితా
హోం వ్యవహారాల శాఖ మంత్రి (లేదా కేవలం, హోం మంత్రి, సంక్షిప్త రూపం ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధిపతి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోని అత్యంత సీనియర్ మంత్రులలో హోం శాఖ మంత్రి ఒకరు పోలీస్ శాఖకు సంబంధించిన వ్యవహారాలను హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
నాయకత్వానికి (ఆంగ్లం: Leadership) ప్రత్యామ్నాయ నిర్వచనాలు ఉన్నప్పటికీ, అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఛేదించటానికి ఒక వ్యక్తి ఇతరుల సహాయం, మద్దతుతో ముందుకెళ్ళే ఒక సాంఘిక ప్రభావాత్మక ప్రక్రియగా నాయకత్వం వర్ణించబడింది. ఇతరులచే అనుసరించబడేవారే, ఇతరులకి దిశానిర్దేశం చేసేవారే నాయకుడు/నాయకురాలు అని కొందరు అనుకొంటే, "ప్రేరణని అందించటం , ఒక సమిష్టి లక్ష్యాన్ని ఛేదించటానికి జనాన్ని సమీకరించి వారిని నిర్విహంచటమే "నాయకత్వం" అని మరికొందరు నిర్వచించారు. నాయకత్వం పై అధ్యయనాలు అలవాట్లు, పరిస్థితుల సంకర్షణ, ధర్మం, ప్రవర్తన, అధికారం, విలువలు, సమ్మోహన శక్తి, మేధస్సు, ఇతర లక్షణాల ఆధారంగా జరిగాయి.ఆంగ్లంలో లీడరు అనే పదాన్ని లింగభేదం లేకుండానే వాడినా, తెలుగులో మాత్రం నాయకత్వం వహించే పురుషుడిని నాయకుడు అని, అదే మహిళ అయితే నాయకురాలు అని వ్యవహరిస్తారు.