The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2024 ఎన్నికలలో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
అంతర్జాతీయ పితృ దినోత్సవము (ఆంగ్లం: Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ప్రపంచము పరమేశ్వరునిచే సృజింపబడిన నామ రూపాత్మకము అని అనుకొనినచో, అందు రూపవ్యవహారముకొరకు నామము ఆవశ్యకమని దానితోడనే నామము సృజింపబడినట్లు "నామరూపే వ్యాకరణాని" "సర్వాణి రూపణి విచిత్యధీరః, నామాని కృత్వా అభివదన్ యదాస్తే" అను శ్రుతి సమంవయమువలన దెలియుచున్నది. ఇట్టి నామము ధ్వని రూపమై సకల వ్యవహారములను నిర్వహింపదగియున్నది. దీనినే "భాష" అని అంటారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15వ శాసనసభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
నైపుణ్యం లేదా టెక్నిక్ అనగా ఏదోటి నేర్పుగా చేయగలిగిన సామర్థ్యం. ఇది ఒక సంగీత పరికరాన్ని వాయించగలగటం లేదా క్రీడ యొక్క ఒక రకమైన ఆట ఆడగలగటం లేదా ఒక కార్క్స్క్రూ ఉపయోగించగలగటం వంటి సాధారణమైనవి ఏదోటీ చేయగలగటం. నైపుణ్యం పొందిన వారితో పోలిస్తే ఆ రంగంలో నైపుణ్యం లేని వారు ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు టెక్నిక్ లను సరిగా ఉపయోగించుకోలేక లక్ష్యాన్ని సాధించలేరు.
పక్షము;-అనగా 15 [రోజులకు](లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి: 1.'శుక్ల పక్షం'(బహుళ పక్షం: శుద్ధ తిధులు, అమావాస్య నుంచి పున్నమి వరకు)రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెలుపు అని అర్థం) 2.'కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
పొంగూరు నారాయణ (జననం: జూన్ 15, 1956) ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ పదవి కన్నా ముందే ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా ఆయన తెలుగు ప్రజలకు చిరపరిచితం. విద్యారంగంలో పి.నారాయణ సాధించిన విజయాలు ఆయనలోని ఓ పార్శ్వాన్ని స్పృశిస్తే, ఇప్పుడు నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు నారాయణ లోని ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. ఎంచుకున్న రెండు రంగాల్లో అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూల పాన్పు కాదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య , అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జార్జియా మెలోని (జననం 1977 జనవరి 15) ఇటాలియన్ రాజకీయ నాయకురాలు, అక్టోబరు 2022 నుండి ఇటలీ ప్రధాన మంత్రిగా పనిచేస్తుంది. ఇటాలియన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ ఈమె. 2006 నుండి ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యురాలిగా వ్యవహరించిన జార్జియా మెలోని 2014 నుండి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ (ఎఫ్డీఐ) పార్టీకి నాయకత్వం వహిస్తోంది.