The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2024 ఎన్నికలలో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
పల్లె సింధూర రెడ్డి (జననం 2 ఆగస్టు 1990) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు పల్లె సింధూర రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డిని ఓడించింది. పల్లె సింధూర రెడ్డి తెలుగు దేశం పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15వ శాసనసభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
1901, జూలై 6 న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు.
మేడిపల్లి సత్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీ నుండి రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2023లో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏకైక విద్యార్థి నాయకుడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు. శాసనసభ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన చట్ట రూపకల్పన సంస్థ. భారత గణతంత్రంలో, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల, రాష్ట్ర శాసనసభలకు స్పీకరు లేదా ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తాలూకా (మండలం) భూమి, దానిపై వసూలు చేయవలసిన పన్నులుద్వారా సంక్రమించే ఆదాయాన్ని పర్వేక్షించే నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. ఈ వ్యవస్థ భారతదేశంలో స్వాతంత్ర్యం రాక ముందు పూర్వకాలం నుండి అమలులో ఉంది.తహసీల్దార్ విధులు నిర్వహించే కార్యాలయాన్నితహసీల్దార్ కార్యాలయం లేదా తాలూకా కార్యాలయం అంటారు. ఇతని పర్వేక్షణలో కొన్ని గ్రామాలు ఉంటాయి.వాటిని రెవెన్యూ గ్రామాలు అంటారు.భూ ఆదాయానికి సంబంధించి తహసీల్ నుంచి పన్నులు పొందే బాధ్యత వారిపై ఉంది.ఇది జిల్లా పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. ఆయన 2018 వ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి. ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.