The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భజే వాయు వేగం 2024లో విడుదలైన తెలుగు సినిమా. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించాడు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న, ట్రైలర్‌ను మే 26న విడుదల చేసి, సినిమాను మే 31న విడుదల చేశారు.
రమేష్ రాథోడ్ (1966 అక్టోబరు 20 - 2024 జూన్ 29) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు లంబాడీ సామాజిక వర్గం.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి (1999-2004) శాసనసభ్యుడిగా ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి (2009-2014) 15వ పార్లమెంటు సభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ (2006-2009), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశాడు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ ఏర్పాటు చేయడం కోసం 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రాష్ట్రంలో 2024 మే 13న జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ 2024 జూన్ 4న జరిగింది.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు.
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ OBE, FNA, FASc, FRS (1893 జూన్ 29 - 1972 జూన్ 28) భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక కొలత అయిన "మహలనోబిస్ డిస్టెన్స్" ద్వారా గుర్తింపబడ్డాడు.
వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జస్ప్రీత్ జస్బీర్సింగ్ బుమ్రా (జననం 1993 డిసెంబరు 6) అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్‌తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలరైన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
అక్షర్ రాజేష్‌భాయ్ పటేల్ (జననం 1994 జనవరి 20) ఆటలోని అన్ని ఫార్మాట్లలో స్పిన్ ఆల్-రౌండర్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో గుజరాత్‌కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఆడతాడు. ఆయన ఎడమచేతి వాటం బ్యాటర్, అలాగే స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
లవ్, మౌళి 2024 లో విడుదలైన తెలుగు సినిమా. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సి స్పేస్ నిర్మించిన ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించాడు. నవదీప్, పంఖురి గిద్వానీ, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 27న, ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 9న విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ భారత పార్లమెంటు దిగువసభ అయిన లోక్‌సభలోని రెండవ అత్యున్నత స్థాయి శాసన అధికారి. లోక్‌సభ స్పీకర్ మరణం లేదా అనారోగ్యం కారణంగా సెలవు లేదా ఇతరత్రా కారణాలవలన గైర్హాజరైనప్పుడు డిప్యూటీ స్పీకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయడం పార్లమెంటు సంప్రదాయం.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ. దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు. ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.