The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. సభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
ఇండియా కూటమి (ఆంగ్లం: Indian National Developmental Inclusive Alliance) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలోని 26 రాజకీయ పార్టీల కూటమి. ఇండియా(ఐఎన్‌డిఐఎ) అంటే ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్ కాగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడం దీని ప్రాథమిక లక్ష్యం.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
తెలంగాణలో తదుపరి భారత సాధారణ ఎన్నికలు 18వ లోక్‌సభకు 17 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మే 13న ఎన్నికలు జరగగా రాష్ట్రవ్యాప్తంగా 66.30% పోలింగ్ శాతం నమోదయింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా 2014 రాష్ట్రంలో ఎన్నికలు ఏడవ దశ ( 2014 ఏప్రిల్ 30), ఎనిమిదవ దశ ( 2014 మే 7)ల్లో నిర్వహించారు. అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన చివరి ఎన్నికలు ఇవే, విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా, భాజపా కలసి జనసేన మద్ధతుతో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో తెరాస ఏకపక్షంగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణ రాష్ట్రం విభజించిన తరువాత రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు, 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
దేశాల జాబితా – ISO 3166-1 కోడ్
ఐఎస్ఒ 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం. ఇది ప్రామాణీకరణలో ఒక భాగం. వివిధ దేశాలకు, ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్లు ఇవ్వబడుతాయి.ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO 3166-1) కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురించింది.
ప్రతిపక్ష నాయకుడు అనగా లోక్‌సభ, శాసనసభ, రాజ్యసభలలో అధికార పార్టీకి పోటీగా ఏర్పడిన ఒక పెద్ద పార్టీకి రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తి.ఇతను అధికారంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగ లోపాలను గట్టిగా ప్రశ్నిస్తాడు.ప్రతిపక్షనేత తరచుగా ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అంతటి హోదాకలిగిన వ్యక్తిగా చూడబడతాడు. అతను షాడో క్యాబినెట్ లేదా ప్రతిపక్ష పార్ఝీగా పిలవబడే ఒక ప్రత్యామ్నాయ బెంచ్‌కి ప్రధాన నాయకుడు.ప్రశ్నల సమయంలో ప్రతిపక్షపార్టీ తరపున ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని లేదా మంత్రులను ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుని ప్రధాన కర్తవ్యం. ప్రతిపక్ష నాయకుడు సభలో ముఖ్యమైన కార్యకర్త.అతని ప్రాముఖ్యతను గుర్తించి మంత్రి హోదా ఇవ్వబడుతుంది.
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది.
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004, 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
డి.కె.అరుణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది.
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
వంగా గీత (జననం 1964 మార్చి 1) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యింది. ఆమె ఇంతకుముందు పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, భారత పార్లమెంటు ఎగువ సభ లో తెలుగు దేశమ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగించుటకు ఏర్పడిన రాష్ట్ర కాబినెట్ చేత 2014 జూన్ 8న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట కాబినెట్ మంత్రుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూపబడ్డాయి.
బొత్స సత్యనారాయణ (జననం 9 జూలై 1958) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. భారతదేశంలో మాల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది.