The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న, ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా, సినిమా ఆగస్ట్ 9న సినిమా విడుదలైంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
ఆర్. జి. కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయిన కోలకతాలో ఉన్న వైద్య పాఠశాల, ఆసుపత్రి.
2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం
16 డిసెంబరు 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు. 16న సాయంత్రం ఆమె తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ ఐదుగురు ప్రయాణికులు ఉన్న బస్సు ఎక్కారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తంగలాన్, 2024 ఆగస్టు 15న విడుదలయిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించబడింది.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ,వీరు హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసే వారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో , ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
మాళవిక మోహన్ (ఆంగ్లం: Malavika Mohanan; జననం 1993 ఆగస్టు 04) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది.
బొత్స సత్యనారాయణ (జననం 9 జూలై 1958) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (బెంగాలీ: পশ্চিমবঙ্গের মুখ্যমন্ত্রী) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉపజాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ఇతనికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు .
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా (ISRO) ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019),(2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
అనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.