The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 814
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 814 (కాల్ సైన్ IC_814), ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A300 విమానం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా అది భారత్ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. మార్గమధ్యంలోనే హైజాకింగ్‌కు గురైంది.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
"శేఖర్ బాషా" en: Shekar Basha ఒక ఆర్జేగా (రేడియో జాకీ) , వీజే గా (టీవీ యాంకర్) మరియ క్రీడా వ్యాఖ్యాత గా (క్రికెట్ కామెంటేటర్) తెలుగు ప్రజలకి సుపరిచితుడే. ఇతను హైదరాబాద్ లోని 92.7 బిగ్ ఎఫ్ఎంలో రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే "కిక్ " కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడు, అలానే టీవీ రంగంలో ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానల్ లలో వీజేగా వ్యవహరించాడు. ఇటీవల జరిగిన 2019 ఇండియా-వెస్ట్ఇండీస్ క్రికెట్ సీజన్ కి క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు (కామెంటేటర్).
పొలాల పండుగ (Eng: Pola Festival, हिंदी: पोला त्योहार ) పొలాల అమావాస్య శ్రావణ మాసం ముగింపు వారాల్లో అమావాస్య రోజున జరుపుకునే పండుగ కాబట్టి పొలాల అమావాస్యను పొలాల పండుగ, లేదా ఎడ్ల పండుగ పేరుతో ఘనంగా జరుపుకుంటారు.. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్ జిల్లా తో పాటు మహారాష్ట్రమధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో రైతులు ఈ ఎడ్ల పండుగను ప్రత్యేకంగా చేయడం అనవాయితి..
కైలాసంపైనడధపఢ ఢధఫ ధడోఖధఃఈఈఉఊఓఫుఓ కఖగఘకఠోపు గఛఝ ఖాళీ స్థలం కూడా మంచిది కాదు అని చెపుతాడు మనము శ్రీశైలము చాలా పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం,mulugu జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
శివం భజే 2024లో విడుదలైన డివోషనల్ థ్రిల్లర్ సినిమా. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమాకు అప్సర్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, 'హైపర్' ఆది, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ టీజర్‌ను జూన్ 19న, ట్రైలర్‌ను నటుడు విశ్వక్సేన్ జులై 23న విడుదల చేయగా, సినిమాను ఆగస్ట్ 1న విడుదలైంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
విశ్వకర్మీయుల/విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము.ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బలు తినాల్సిందే. భగభగ మండే కొలిమి ముందు కూర్చుని వేడిని లెక్క చేయక రైతుకు అవసరమైన పనిముట్లు చేస్తాడు.
నగరం లేదా నగరాలు (ఆంగ్లం: City), అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం లేదా జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించి జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం/ప్రాంతాలను నగరం లేదా నగరాలు అని అంటారు. ఇవి చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేక అధికారం కలిగి స్వయంపరిపాలన, అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.వీటిని నిర్వచించటంలో భారత జనాభా గణాంకాల శాఖ ప్రముఖ పాత్ర వహించింది.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు.