The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
డాకు మహారాజ్ 2025లో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైంది.
సోమవారము లేదా ఇందువారము ( లేదా ) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు, మంగళవారమునకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు, హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది.
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలకానున్న సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
ఊర్వశి రౌటేలా (జననం 1994 ఫిబ్రవరి 25) ఒక భారతీయ నటి, మోడల్, ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, తెలుగు సినిమాలో కనిపిస్తుంది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది, అయినప్పటికీ ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ యూనివర్స్ 2015 పోటీలో స్థానం పొందలేదు. రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ (2013)తో తొలిసారిగా నటించింది, ఆ తర్వాత సనమ్ రే (2016).
ఆంధ్ర మరియా తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకులలో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం. సంక్రాతి సంబరాలలో మొదటి రోజు వచ్ఛే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో పదమూడవ రోజు, లీపు సంవత్సరంలో పద్నాల్గవ రోజు వస్తుంది.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు.
యల్లాప్రగడ సుబ్బారావు (1895 జనవరి 12 - 1948 ఆగష్టు 9) భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సాలెగూడు అనగా సాలెపురుగు గూడు, దీనిని ఆంగ్లంలో "స్పైడర్ వెబ్" అంటారు. ఇది జిగురుగా ఉండే ఒక వల వంటిది, సాలెపురుగులు తనకు కావలసిన ఆహారాన్ని బంధించేందుకు వాటి ఉదరము నుంచి స్రవించే పట్టు వంటి దారంతో దీనిని తయారు చేస్తాయి. కీటకాలు ఎగురుతూ వచ్చి, లేదా ప్రాకుతూ వచ్చి ఈ వెబ్ లో చిక్కుకున్నపుడు అవి తప్పించుకోలేవు, అప్పుడు సాలీడు ఆ కీటకాలను తినేస్తుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మహారాజ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతీరాజా, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 30న విడుదల చేసి, సినిమాను జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.
రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత. 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ "అయే లైలా" తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ [V] వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.