The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
డాకు మహారాజ్ 2025లో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైంది.
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలైన సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదలైంది.
ఊర్వశి రౌటేలా (జననం 1994 ఫిబ్రవరి 25) ఒక భారతీయ నటి, మోడల్, ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, తెలుగు సినిమాలో కనిపిస్తుంది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది, అయినప్పటికీ ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ యూనివర్స్ 2015 పోటీలో స్థానం పొందలేదు. రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ (2013)తో తొలిసారిగా నటించింది, ఆ తర్వాత సనమ్ రే (2016).
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
ఉపేంద్ర లిమాయే (జననం 8 నవంబర్ 1969) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మరాఠీ చిత్రం జోగ్వాలో తన పాత్రకుగాను జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. భారతీయ సినిమా శతజయంతి సందర్భంగా ఏప్రిల్ 2013లో ఫోర్బ్స్ జోగ్వా చిత్రంలో లిమాయే నటనను "భారతీయ సినిమాలోని 25 గొప్ప నటనా ప్రదర్శనలు" జాబితాలో చేర్చింది.
ఆంధ్ర మరియా తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకులలో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం. సంక్రాతి సంబరాలలో మొదటి రోజు వచ్ఛే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో పదమూడవ రోజు, లీపు సంవత్సరంలో పద్నాల్గవ రోజు వస్తుంది.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత. 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ "అయే లైలా" తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ [V] వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది.
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
సోమవారము లేదా ఇందువారము ( లేదా ) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు, మంగళవారమునకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు, హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
నవధాన్యాలు అనగా తొమ్మిది రకాల ధాన్యాలు. అవి 1గోధుమలు 2యవలు 3పెసలు 4శనగలు 5కందులు 6అలసందలు 7నువ్వులు 8మినుములు 9ఉలవలు నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.
హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు .
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.