The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలైన సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదలైంది.
డాకు మహారాజ్ 2025లో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైంది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
ఆజాద్ 2025లో విడుదలకానున్న హింది సినిమా. గై ఇన్ ది స్కై పిక్చర్స్, ఆర్ఎస్విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్, డయానా పెంటీ, అమన్ దేవగన్, రాషా తడాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమాను జనవరి 17న విడుదల చేశారు.
ఉపేంద్ర లిమాయే (జననం 8 నవంబర్ 1969) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మరాఠీ చిత్రం జోగ్వాలో తన పాత్రకుగాను జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. భారతీయ సినిమా శతజయంతి సందర్భంగా ఏప్రిల్ 2013లో ఫోర్బ్స్ జోగ్వా చిత్రంలో లిమాయే నటనను "భారతీయ సినిమాలోని 25 గొప్ప నటనా ప్రదర్శనలు" జాబితాలో చేర్చింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
ఊర్వశి రౌటేలా (జననం 1994 ఫిబ్రవరి 25) ఒక భారతీయ నటి, మోడల్, ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, తెలుగు సినిమాలో కనిపిస్తుంది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది, అయినప్పటికీ ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ యూనివర్స్ 2015 పోటీలో స్థానం పొందలేదు. రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ (2013)తో తొలిసారిగా నటించింది, ఆ తర్వాత సనమ్ రే (2016).
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రామ్‌నగర్ బన్నీ 2024లో విడుదలైన తెలుగు సినిమా. దివిజ ప్రభాకర్ సమర్పణలో శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మలయజ ప్రభాకర్, ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించాడు. చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 16న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి, అక్టోబర్ 4న విడుదలైంది.
అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)
అప్పుచేసి పప్పుకూడు విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ పాటలు ప్రసిధ్ధి పొందాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానాగా ప్రసిద్ధి, జననం 1944 డిసెంబరు 8) ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి 2011ల మధ్య పనిచేసింది.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal () (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
సారా అలీ ఖాన్ (ఆంగ్లం: Sara Ali Khan; జననం 1995 ఆగస్టు 12) హిందీ చిత్రసీమకు భారతీయ నటి. ఆమె నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన తర్వాత, ఆమె తన నటనా జీవితాన్ని 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో ప్రారంభించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ప్రభుత్వాధీనంలోని సంస్థ. సింగరేణి, పరిసర గోదావరీ లోయలో బొగ్గు గనుల త్రవ్వకాలు, పంపిణి మొదలైనవి దీని పని.
రోహిత్ చక్రవర్తి వేముల హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థిగా చదువుకునేవాడు. జూలై 2015 నుంచి విశ్వవిద్యాలయం రోహిత్‌కు 25,000 ఉపకారవేతనాన్ని నిలిపివేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే వివిధ సమస్యల వలన రోహిత్‌ను కేంద్రం చేసుకుని ప్రతికూల వర్గాల వ్యక్తులు దాడి చేసారని రోహిత్ స్నేహితులు అంటారు.