The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలైన సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న థియేటర్లలో .
డాకు మహారాజ్ 2025లో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జనవరి 12న విడుదలైంది.
లాలా లజపత్ రాయ్ (1865 జనవరి 28-1928 నవంబరు 17) (ఆంగ్లం: Lala Lajpat Rai) - (పంజాబీ భాష: ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; హిందీ భాష: लाला लाजपत राय) భారత్ కు చెందిన రచయిత, రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జనవరి 28, 1865 న జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయి, నవంబరు 17, 1928 న.తుది శ్వాస విడిచాడు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
2025 మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్
భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ జిల్లాలో ( माहाकुंभ मेला प्रयोगराज) గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ళ తర్వాత ఒక సారి జరుగుతుంది. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళ అని నామకరణం చేశారు.ఈ కుంభమేళ 45 రోజుల పాటు సాగనుంది.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమిపై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
ఐ పి అడ్రసు (ఇంటర్నెట్ ప్రోటోకోల్ అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పంపేటపుడు కంపూటర్ల వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
మంద కృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు.వరంగల్ జిల్లా హంటర్‌రోడ్డు శాయంపేటలో జన్మించారు. 14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా.. ఒక చిన్న గ్రామం ఈదుమూడి , ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం.అర్.పి.ఎస్) కృషి చేసింది.
గోధ్ర రైలు దహనం అనేది 2002 ఫిబ్రవరి 27 న గుజరాత్ లోని గోధ్ర రైలు స్టేషను వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడగా 59 మంది దుర్మరణం పాలైన దుర్ఘటన. అయోధ్య లోని బాబరీ మసీదు స్థలం వద్ద కరసేవకు వెళ్ళి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులు ఈ మృతుల్లో అధికులు. గుజరాత్ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిషను ఆరేళ్ళ దర్యాప్తు తరువాత, 1,000 నుండి 2,000 మంది దాకా ఉన్న మూక చేసిన దహన కాండ ఇది అని తేల్చింది.
***భగవద్గీత క్లుప్తంగా*** మొదట పరమాత్మ ఉంది (పరమాత్మ అంటే ఈశ్వరుడు) పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు (జీవాత్మ అంటే అన్ని జీవులు) జననం మరియు మరణం నిరంతర ప్రక్రియ ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది (మన మరొక జన్మ చీమ కావచ్చు లేదా పాము కావచ్చు లేదా చేప కావచ్చు లేదా పక్షి కావచ్చు లేదా జంతువు కావచ్చు లేదా మనిషి కావచ్చు అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది) మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడటం మోక్షం యొక్క మరొక అర్థం మరణానికి ముందు కామ,క్రోధ, లోభ,మోహ,మద,మాత్సర్యాలను వదిలిపెట్టడం మోక్షాన్ని నాలుగు విధాలుగా సాధించవచ్చు 1.కర్మ యోగం - ఏమీ ఆశించకుండా కర్మ చేయడం 2. భక్తి యోగం - ఏమీ ఆశించకుండా దేవతలు మరియు దేవాలయాలకు సంబంధించిన సేవ చేయడం 3.జ్ఞాన యోగం - జ్ఞానాన్ని పొందడం మరియు ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని పంచడం 4.క్రియా యోగా లేదా రాజయోగం - ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి ధర్మం అంటే బాధ,భయం వదిలి బాధ్యతలు నిర్వర్తించడం ధర్మానికి నిజమైన అర్థం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మోసం చేయకుండా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇవ్వడం మరియు తీసుకోవడం *** భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
యూనిఫాం సివిల్ కోడ్ (ఆంగ్లం: Uniform Civil Code; హిందీ: समान नागरिक संहिता) అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతీయ చట్టం. ఇది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుంది. అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడం అన్నమాట.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.