The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
అలిస్సా జీన్ హీలీ (జననం 24 మార్చి 1990) ఆస్ట్రేలియా క్రికెటర్. ఆమె ఆస్ట్రేలియన్ మహిళల జాతీయ జట్టు తరపున ఆడి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆమె దేశీయ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ తరపున, అలాగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో సిడ్నీ సిక్సర్స్ తరపున, భారతదేశంలోని మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్‌కు కెప్టెన్‌గా ఆడుతుంది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
మిరాయ్ 2025లో 1విడుదలైన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 28న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి, సినిమాను 8 భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల చేశారు.
కాంతార: చాప్టర్ 1 అనేది రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన భారతీయ కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం. ఇది 2022 చిత్రం కాంతార: చాప్టర్ 2 కి ప్రీక్వెల్, ఈ కథ మొదటి చిత్రంలో ప్రవేశపెట్టిన దైవిక సంప్రదాయం, పూర్వీకుల సంఘర్షణ మూలాలను లోతుగా పరిశీలిస్తుంది. వలసరాజ్యాల పూర్వ తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భూతా కోలా ఆచారం పురాతన మూలాలను, దైవిక భూ సంరక్షకత్వం చుట్టూ ఉన్న పౌరాణిక కథలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
బి.సరోజాదేవి నటించిన తెలుగు సినిమాల జాబితా
ప్రముఖ నటి బి.సరోజా దేవి (1942 జనవరి 07 - 2025 జులై 14) నటించిన సినిమాల పాక్షిక జాబితా:
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.
బాపు 2025లో తెలుగులో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2025లో విడుదలైన తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
జాన్ క్విన్సీ ఆడమ్సు (; జూలై 11, 1767 – ఫిబ్రవరి 23, 1848) 1825 నుండి 1829 వరకు ఆరవ యునైటెడు స్టేట్సు అధ్యక్షుడుగా పనిచేశాడు. గతంలో అతను 1817 నుండి 1825 వరకు ఎనిమిదవ యునైటెడు స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేటుగా పనిచేశాడు. తన సుదీర్ఘ దౌత్య మరియు రాజకీయ జీవితంలో, ఆడమ్స్ రాయబారిగా, యునైటెడు స్టేట్సు కాంగ్రెసు సభ్యుడిగా రెండు సభలలో మసాచుసెట్సుకు ప్రాతినిధ్యం వహించాడు.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
రాజావారు రాణిగారు 2019లో విడుదలైన చిత్రం. ఎస్.ఎల్ ఎంటర్టైన్మెంట్స్ & మీడియా9 బ్యానర్ పై మనోవికాస్.డి, మనోజ్ నిర్మించిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజావారు రాణిగారు టీజర్‌ను 2019, నవంబర్ 18న విడుదల చేసి, సినిమాను నవంబర్ 29న విడుదల చేశారు.
క్రికెట్ ఆటలో, రెండవ బ్యాటింగ్ చేసిన జట్టు మొదటి ఇన్నింగ్సులో చేసిన స్కోరు, మొదటి జట్టు చేసిన స్కోరు కంటే నిర్దుష్టమైన సంఖ్యకు పైగా పరుగులు తక్కువగా ఉంటే, రెండవ జట్టును వెంటనే రెండవ ఇన్నింగ్సు ఆడమని మొదటి జట్టు కెప్టెన్ చెప్పవచ్చు. దీన్ని ఫాలో-ఆన్ అంటారు. టెస్టు డ్రా అయ్యే అవకాశాలను తగ్గించి, తక్కువ స్కోరు చేసిన జట్టును రెండవ ఇన్నింగ్సులో త్వరగా ఆలౌట్ చేసి గెలుపు సాధించే యోచనతో మొదటి జట్టు ఫాలో ఆన్ వ్యూహాన్ని అవలంబిస్తుంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.
తమ్ముడు 2025లో విడుదలైన ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియోను మే 12న, ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేసి, సినిమాను జూలై 4న విడుదల చేశారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.