The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కె- ర్యాంప్ 2025లో విడుదలైన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 19న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వామం ఉండాలి. పెద్దదేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
దితి, కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒక సారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్రగర్భంలో దాచి పెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి, వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు...ఆ సమయములో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు.ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది.దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భుదేవి ఎంతో సంతోషిస్తుంది.తర్వాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది.ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు.
గోవర్ధన్ అస్రానీ (1940 జనవరి 1 - 2025 అక్టోబరు 20), మోనోనిమ్ అస్రానీ భారతీయ సినీ నటుడు, దర్శకుడు. ఆయన 1966లో సినీరంగంలోకి అడుగుపెట్టి 350కి పైగా హిందీ సినిమాల్లో ప్రధాన పాత్రలు, క్యారెక్టర్ రోల్స్, హాస్య పాత్రలు & సహాయక పాత్రలలో నటించాడు. అస్రాని చల మురారి హీరో బన్నె, సలామ్ మేంసాబ్ లాంటి కొన్ని హిందీ సినిమాల్లో హీరోగా, గుజరాతీ సినిమాల్లో 1972 నుండి 1984 వరకు హీరోగా నటించి, 1985 నుండి 2012 వరకు క్యారెక్టర్ పాత్రలు పోషించి, 1974 & 1997 మధ్య ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కర్త. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడే విశాఖపట్నం హైదరాబాద్‌లో ఉన్న ప్రొఫెషనల్ కబడ్డీ జట్టు. తెలుగు టైటాన్స్ తమ ప్రాక్టీస్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జిఎంసి బాలయోగి SATS ఇండోర్ స్టేడియంలో విశాఖపట్నంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆడుతుంది. సీజన్ 9లో వారు మంజీత్ చిల్లర్‌లో బెస్ట్ డిఫెండర్‌గా తెలుగు టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.