The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.
కాంతార: చాప్టర్ 1 అనేది రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన భారతీయ కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం. ఇది 2022 చిత్రం కాంతార: చాప్టర్ 2 కి ప్రీక్వెల్, ఈ కథ మొదటి చిత్రంలో ప్రవేశపెట్టిన దైవిక సంప్రదాయం, పూర్వీకుల సంఘర్షణ మూలాలను లోతుగా పరిశీలిస్తుంది. వలసరాజ్యాల పూర్వ తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భూతా కోలా ఆచారం పురాతన మూలాలను, దైవిక భూ సంరక్షకత్వం చుట్టూ ఉన్న పౌరాణిక కథలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
G వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.
లాల్ బహదూర్ శాస్త్రి ( వినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2023లో విడుదలైన తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు.
బాపు 2025లో తెలుగులో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.
మహాజనానికి మరదలుపిల్ల 1990 లో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వంలో విజయ బాపినీడు పర్యవేక్షణలో రాశి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మించాడు రాజేంద్ర ప్రసాద్, నిరోషా ముఖ్య పాత్రల్లో నటించారు, ఉపేంద్ర కుమార్ సంగీతం సమకూర్చాడు. 1989 నాటి కన్నడ చిత్రం నంజుండి కల్యాణకు రీమేక్.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
లిటిల్ హార్ట్స్ (2025 తెలుగు సినిమా)
లిటిల్ హార్ట్స్ 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు.