The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
కె- ర్యాంప్ 2025లో విడుదలైన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 19న, ట్రైలర్‌ను అక్టోబర్ 11న విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
దీప్తి శర్మ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2014 నవంబరు 28న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో, 2016 జనవరి 31న ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. దీప్తి శర్మ ఐసీసీ మహిళా వన్డే కప్ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైంది.
రిచా ఘోష్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2020 ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో, 2021 సెప్టెంబరు 21న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు చేసి అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది.
అలిస్సా జీన్ హీలీ (జననం 24 మార్చి 1990) ఆస్ట్రేలియా క్రికెటర్. ఆమె ఆస్ట్రేలియన్ మహిళల జాతీయ జట్టు తరపున ఆడి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆమె దేశీయ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ తరపున, అలాగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో సిడ్నీ సిక్సర్స్ తరపున, భారతదేశంలోని మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్‌కు కెప్టెన్‌గా ఆడుతుంది.
ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.
మొహమ్మద్ అజారుద్దీన్ (జననం 8 ఫిబ్రవరి 1963) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్, భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఆయన భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆయన కెప్టెన్‌గా 1990–91, 1995 ఆసియా కప్‌లలో జట్టును విజయాలకు నడిపించాడు, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి. లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు.
కంభం చెరువు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయింది.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
ఫోబ్ ఎలిజబెత్ సుసాన్ లిచ్‌ఫీల్డ్ (జననం 18 ఏప్రిల్ 2003) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటర్. ఆమె ఆటలోని మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడుతుంది. ఆమె ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ లో న్యూ సౌత్ వేల్స్ బ్రేకర్స్ తరపున ఆడుతుంది, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఉంది.
ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ (జననం నవంబర్ 3, 1990) ఆస్ట్రేలియన్ క్రికెటర్, మాజీ సాకర్ క్రీడాకారిణి. ఆమె 16 సంవత్సరాల వయసులో జాతీయ క్రికెట్, జాతీయ సాకర్ జట్టు రెండింటికీ అరంగేట్రం చేసిన, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కురాలైన ఆస్ట్రేలియన్, ఐసీసీ & ఫిఫా ప్రపంచ కప్‌లలో కనిపించిన మొదటి వ్యక్తి. ఆమె 2014 నుండి క్రమంగా సింగిల్-స్పోర్ట్ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఎదుగుతూ, ప్రశంసలు పొందిన క్రికెట్ కెరీర్ వృద్ధి చెందుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 13వ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అవుతుంది. దీనిని శ్రీలంక, భారత్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 1978 , 1997 & 2013 ఎడిషన్ల తర్వాత భారత్ మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించడం ఇది నాల్గవసారి, శ్రీలంక ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
పింఛను, అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో వారి రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు లేదా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్‌గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడే విశాఖపట్నం హైదరాబాద్‌లో ఉన్న ప్రొఫెషనల్ కబడ్డీ జట్టు. తెలుగు టైటాన్స్ తమ ప్రాక్టీస్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జిఎంసి బాలయోగి SATS ఇండోర్ స్టేడియంలో విశాఖపట్నంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆడుతుంది. సీజన్ 9లో వారు మంజీత్ చిల్లర్‌లో బెస్ట్ డిఫెండర్‌గా తెలుగు టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.