The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కుచేలోపాఖ్యానం మహాగ్రంథాలు - శ్రీ మహాభాగవతము చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలోను, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయ్యారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
G వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.
కాంతార: చాప్టర్ 1 అనేది రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన భారతీయ కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం. ఇది 2022 చిత్రం కాంతార: చాప్టర్ 2 కి ప్రీక్వెల్, ఈ కథ మొదటి చిత్రంలో ప్రవేశపెట్టిన దైవిక సంప్రదాయం, పూర్వీకుల సంఘర్షణ మూలాలను లోతుగా పరిశీలిస్తుంది. వలసరాజ్యాల పూర్వ తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భూతా కోలా ఆచారం పురాతన మూలాలను, దైవిక భూ సంరక్షకత్వం చుట్టూ ఉన్న పౌరాణిక కథలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు.
కుబేరా 2025లో విడుదలైన భారతీయ డ్రామా చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్భ్, రష్మికా మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటించారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2025లో విడుదలైన తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
ఈ యేడాది కూడా 26 చిత్రాలు విడుదల కాగా, అందులో యన్టీఆర్ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఐదు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "గుండమ్మ కథ, మంచిమనసులు, రక్తసంబంధం" చిత్రాలు అఖండ విజయం సాధించి రజతోత్సవం జరుపుకోగా, "ఆరాధన, కులగోత్రాలు, సిరిసంపదలు, గులేబకావళి కథ, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువు, ఖైదీ కన్నయ్య" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "గాలి మేడలు, దక్షయజ్ఞం, పదండి ముందుకు, మదనకామరాజు కథ" చిత్రాలు కూడా ప్రజాదరణ పొందాయి.
ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్ 2025లో విడుదలైన థ్రిల్లర్ వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సిరీస్‌కు రాజేష్ ఎం.సెల్వా దర్శకత్వం వహించాడు. శ్రద్దా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, ఛాందినీ, శ్యామ హరిణి, బాలహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.
మిరాయ్ 2025లో 1విడుదలైన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 28న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి, సినిమాను 8 భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల చేశారు.
పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
బాపు 2025లో తెలుగులో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.
లిటిల్ హార్ట్స్ (2025 తెలుగు సినిమా)
లిటిల్ హార్ట్స్ 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.