The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
G వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
భూషణ్ రామకృష్ణ గవై (జననం: 1960 నవంబరు 24) ఒక భారతీయ న్యాయవాది, ప్రస్తుతం 2025 మే 14 నుండి భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అతను బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం కొన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (NLU) ఛాన్సలర్‌గా కూడా పనిచేస్తున్నారు. అతను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎక్స్ అఫీషియో ప్యాట్రన్-ఇన్-చీఫ్ కూడా వ్యవహరిస్తున్నారు.
పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
కాంతార: చాప్టర్ 1 అనేది రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన భారతీయ కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం. ఇది 2022 చిత్రం కాంతార: చాప్టర్ 2 కి ప్రీక్వెల్, ఈ కథ మొదటి చిత్రంలో ప్రవేశపెట్టిన దైవిక సంప్రదాయం, పూర్వీకుల సంఘర్షణ మూలాలను లోతుగా పరిశీలిస్తుంది. వలసరాజ్యాల పూర్వ తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భూతా కోలా ఆచారం పురాతన మూలాలను, దైవిక భూ సంరక్షకత్వం చుట్టూ ఉన్న పౌరాణిక కథలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మానవ వనరులు (ఆంగ్లం:human resources) పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన నిర్వహణకు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే భారతదేశంలో గుర్తించవచ్చును. భగవద్గీతలో, కృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన స్వీయ నిర్వహణ (self management), ఆగ్రహ నిర్వహణ (anger management), ఒత్తిడి నిర్వహణ (stress management), సంఘర్షణ నిర్వహణ (friction management), నాయకుని మార్పిడి (change of leadership), ప్రేరణ (motivation), లక్ష్యం నిర్దేశ్యం (goals and objectives) మొదలగు వంటి వాటి గురించి ప్రస్తావించబడింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.
శరత్ పూర్ణిమ (కోజాగరాత్రి పూర్ణిమ), శరదృతువులో ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీదేవి ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సిరిమాను చెట్టు కొరకు చూడండి సిరిమాను చెట్టు సిరిమాను (సిరిమానోత్సవం) అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం పేరిట ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2025 జూన్ 8న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, 11న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను కేటాయించింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2025లో విడుదలైన తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
కుచేలోపాఖ్యానం మహాగ్రంథాలు - శ్రీ మహాభాగవతము చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలోను, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయ్యారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా (ISRO) ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
బాపు 2025లో తెలుగులో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.
రోషగాడు 2019లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో పార్వతి మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమాకు గణేషా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో ‘తిమురు పుడిచావన్' పేరుతో తెలుగులో ‘రోషగాడు' పేరుతో నిర్మించగా విజయ్ ఆంటోని, నివేదా పేతురాజ్, సాయి దీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 16 నవంబర్ 2018న విడుదలైంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.