The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
2025 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని తెలిపారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
శివాజీ రాజా (ఫిబ్రవరి 26 1962) తెలుగు సినిమా టీవి నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.
భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు.1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.
సూర్యకాంత్ శర్మ (జననం 1962 ఫిబ్రవరి 10) భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీనియారిటీ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన 53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమించబడ్డాడు. ఆయన 2025 నవంబరు 24న సీజేఐగా ప్రమాణం చేసి, 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతాడు. ఆయన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే ముందు సీనియర్ న్యాయవాదిగా, హర్యానాకు అడ్వకేట్ జనరల్‌గా పని చేశాడు.
సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య (నవంబర్ 24, 1880 - డిసెంబర్ 17, 1959) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను ) గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పలాష్ ముచ్చల్ (జననం 1995 మే 22) ఒక భారతీయ సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాత. గుండె జబ్బుల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమైన పేద పిల్లల కోసం నిధులు సేకరించడానికి ఆయన, అతని అక్క పాలక్ ముచ్చల్ భారతదేశం, విదేశాలలో రంగస్థల ప్రదర్శనలు చేస్తున్నారు. మే 2013 నాటికి వారు ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా 25 మిలియన్ల రూపాయల నిధులను సేకరించారు, ఇది గుండె జబ్బులతో బాధపడుతున్న 885 మంది పిల్లల ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
మంగళసూత్రం - ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే, ఈ సూత్రం ధరించినందువల్ల మానవ జీవితములో అనేక మంగళములు కలుగుతున్నాయి కనక ఈ సూత్రానికి మంగళసూత్రానికి అంటే ఒక సాధారణంగా కనిపించే మామూలు తాడుకు పసుపు పూసి కట్టిన తాడు కు మంగళసూత్రం అని పేరు వచ్చింది. స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక కుటుంబంగా జీవించడానికి ఇష్టపడి ఈ సూత్రముని ధరించడానికి స్త్రీ దానిని ధరింప చెయ్యడానికి పురుషుడు అంగీకరించి వివాహము ( విశేషమైన వాహము అంటే విశేషమైన జీవన విధానమునకు విశేషమైన జీవనానికి ఆధారము అవుతున్నది కనక ఇది వివాహము అవుతోంది. మనిషి జీవితంలో ఈ సూత్రం ధరించి ఆ మంగళములను పొందుతున్నారు కనక మంగళ సూత్రం అని పేరు వచ్చింది.
12ఎ రైల్వే కాలనీ 2025లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, జీవన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 17న, ట్రైలర్‌ను నవంబర్ 11న విడుదల చేసి, నవంబర్ 21న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964) ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది భారతదేశ దక్షిణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన పేర్వారం రాములు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మొదటి చైర్మన్‌గా నియమితులయ్యాడు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల జాబితాలో చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, కోటలు, జలపాతాలు, అడవులు, దేవాలయాలు ఉన్నాయి.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
మడావి హిడ్మా (1974 - 2025 నవంబరు 18) భారతీయ నక్సలైట్, అతను తన నియామకం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడికి హిడ్మాకు బాధ్యత ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన ఉన్నాడు.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు, (ఆంగ్లం: Directive Principles). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?