The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
దీప్తి శర్మ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2014 నవంబరు 28న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో, 2016 జనవరి 31న ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. దీప్తి శర్మ ఐసీసీ మహిళా వన్డే కప్ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైంది.
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది.
ఝులన్ గోస్వామి భారత మహిళా క్రికెట జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె మహిళ క్రికెట్ వన్డే ప్రపంచకప్‌లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన మొదటి మహిళా బౌలర్‌గా, భారత్ తరపున 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' పేరుతో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
పలాష్ ముచ్చల్ (జననం 1995 మే 22) ఒక భారతీయ సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాత. గుండె జబ్బుల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమైన పేద పిల్లల కోసం నిధులు సేకరించడానికి ఆయన, అతని అక్క పాలక్ ముచ్చల్ భారతదేశం, విదేశాలలో రంగస్థల ప్రదర్శనలు చేస్తున్నారు. మే 2013 నాటికి వారు ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా 25 మిలియన్ల రూపాయల నిధులను సేకరించారు, ఇది గుండె జబ్బులతో బాధపడుతున్న 885 మంది పిల్లల ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది.
రిచా ఘోష్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2020 ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో, 2021 సెప్టెంబరు 21న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు చేసి అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వామం ఉండాలి. పెద్దదేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 13వ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అవుతుంది. దీనిని శ్రీలంక, భారత్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 1978 , 1997 & 2013 ఎడిషన్ల తర్వాత భారత్ మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించడం ఇది నాల్గవసారి, శ్రీలంక ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
అంజుమ్ ఛోప్రా (జననం.మే 20 1977) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె ఫిబ్రవరి 12 1995లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా న్యూజీలాండ్ లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‌తో 1995 నవంబరు 17 లో మ్యాచ్ లో పాల్గొన్నారు.
అమర్త్య కుమార్ సేన్ (జ. 1933 నవంబరు 3, శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికానికి కారణములు, ఉదారవాద రాజకీయాలలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది.
లోకా: ఛాప్టర్ 1 - చంద్ర డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన, దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ క్రింద నిర్మించిన 2025లో రాబోయే భారతీయ మలయాళ భాషా సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ తన మొదటి సూపర్ హీరో పాత్రలో, నస్లెన్ ప్రధాన పాత్రలో నటించారు. అరుణ్ కురియన్, చందు సలీమ్ కుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పలేరి, విజయరాఘవన్, నిత్యశ్రీ, శరత్ సభ తదితరులు ఇందులో నటించారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.