The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మీరా నాయర్ (జననం 15 అక్టోబర్ 1957) న్యూయార్క్ సిటీ లో నివసిస్తున్న భారతీయ సినిమా నిర్మాత, దర్శకురాలు. ఆమె చిత్రనిర్మాణ సంస్థ మీరాబాయి ఫిలిమ్స్ భారతీయ సమాజం యొక్క సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పార్శ్వాలను సినిమా మాధ్యమంలో అంతర్జాతీయ ప్రేక్షకులకు చూపడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈమె తీసిన సినిమాలలో మిసిసిపి మసాలా, ది నేమ్‌సేక్, మాన్సూన్ వెడ్డింగ్, సలాం బాంబే వంటివి ఉన్నాయి.
జోహ్రాన్ క్వామే మమ్దానీ (జననం అక్టోబర్ 18,1991) ఒక అమెరికన్ రాజకీయవేత్త, ఆయన 2021 నుండి క్వీన్స్‌లో ఉన్న 36వ జిల్లా నుండి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశాడు. 2024లో, 2025 మేయర్ ఎన్నికలలో న్యూయార్క్ నగర మేయర్ కోసం తన అభ్యర్థిత్వాన్ని మమ్దానీ ప్రకటించాడు. డెమొక్రాటిక్ పార్టీ, డెమొక్రాట్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా సభ్యుడు అయిన ఆయన 2025 ఎన్నికలలో న్యూయార్క్ నగర మేయర్ కోసం డెమొక్రాటికల్ నామినీగా భావిస్తున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
దీప్తి శర్మ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2014 నవంబరు 28న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో, 2016 జనవరి 31న ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. దీప్తి శర్మ ఐసీసీ మహిళా వన్డే కప్ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైంది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది.
మహమ్మద్ అజారుద్దీన్ (జననం 8 ఫిబ్రవరి 1963) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్, భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఆయన భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆయన కెప్టెన్‌గా 1990–91, 1995 ఆసియా కప్‌లలో జట్టును విజయాలకు నడిపించాడు, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.
కాంతార: చాప్టర్ 1 అనేది రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన భారతీయ కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం. ఇది 2022 చిత్రం కాంతార: చాప్టర్ 2 కి ప్రీక్వెల్, ఈ కథ మొదటి చిత్రంలో ప్రవేశపెట్టిన దైవిక సంప్రదాయం, పూర్వీకుల సంఘర్షణ మూలాలను లోతుగా పరిశీలిస్తుంది. వలసరాజ్యాల పూర్వ తీరప్రాంత కర్ణాటక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భూతా కోలా ఆచారం పురాతన మూలాలను, దైవిక భూ సంరక్షకత్వం చుట్టూ ఉన్న పౌరాణిక కథలను అన్వేషిస్తుందని భావిస్తున్నారు.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.