The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
గుమ్మడి నర్సయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ లేదా CPI (ML) లో ప్రముఖ సభ్యుడు. ఆయన 1983–1994, 1999–2009 మధ్య యెల్లండు నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలోని సభ్యులలో ప్రజా మనిషిగా పేరు సంపాదించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
జటాధార 2025లో విడుదలైన థిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ & ప్రేరణా అరోరా సమర్పణలో ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 8న, ట్రైలర్‌ను అక్టోబర్ 17న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న తెలుగు, హిందీలో భాషల్లో విడుదల చేశారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్ అనే సినిమా రీమేక్.దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, శోభన, జగ్గయ్య,చంద్రమోహన్ , మున్నగు వారు నటించిన ఈ సూపర్ హిట్ చిత్రానికీ సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.
యునైటెడు స్టేట్సు సామ్రాజ్యవాదం లేదా 'అమెరికను సామ్రాజ్యవాదం అనేది దాని సరిహద్దుల వెలుపల యునైటెడ్ స్టేట్స్ ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, మీడియా మరియు సైనిక శక్తి లేదా నియంత్రణ విస్తరణ. వ్యాఖ్యాతను బట్టి, ఇందులో పూర్తిగా సైనిక విజయం ద్వారా సామ్రాజ్యవాదం ఉండవచ్చు; సైనిక రక్షణ; గన్‌బోటు దౌత్యం; అసమాన ఒప్పందాలు; ప్రాధాన్యత గల వర్గాలకు సబ్సిడీ ఇవ్వడం; పాలన మార్పు; ఆర్థిక లేదా దౌత్యపరమైన మద్దతు; లేదా ప్రైవేటు కంపెనీల ద్వారా ఆర్థిక చొచ్చుకుపోవడం, ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడు దౌత్య లేదా బలవంతపు జోక్యం జరిగే అవకాశం ఉంది. అమెరికను సామ్రాజ్యవాదం, విస్తరణవాదాన్ని శాశ్వతం చేసే విధానాలు సాధారణంగా 19వ శతాబ్దం చివరిలో "నూతన సామ్రాజ్యవాదం"తో ప్రారంభమైనట్లు భావిస్తారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 - 8 ఏప్రిల్, 1894) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; బెంగాలీ: বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়; ఆంగ్లం: Bankim Chandra Chatterjee), 'ఛటోపాధ్యాయ్' ని బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ (ఇఎస్ఆర్), రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎస్ఎన్ఎ), అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ (ఎసిఆర్) కలిసి సంయుక్తంగా 2012లో ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు (ఆంగ్లం:Yaksha Prashna). వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జేమ్స్ బుకానన్ (యుఎస్ అధ్యక్షుడు)
'జేమ్స్ బుకానన్ జూనియర్. ( bew-KAN-ən; 1791 ఏప్రిల్ 23 – 1868 జూన్ 1, ) 1857 నుండి 1857 వరకు 15వ యునైటెడు స్టేట్సు అధ్యక్షుడుగా పనిచేశారు. 1861.
1.1 పరిచయం: ఒడిశాని పరిపాలిస్తునా తూర్పు గంగా రాజవంశం తరువాత మరొక మహిమాన్వితమైన రాజవంశం పాలన స్థాపన జరిగింది సూర్యవంశీ గజపతి రాజులు అని అంటారు. ఒడిశాలో గంగా రాజవంశంలో రాజకీయ గందరగోళం నెలకొంది గాంగుల బలహీనత, అసమర్థత కారణంగా 14 వ శతాబ్దం A.D మధ్యలో శక్తివంతమైన చక్రవర్తి కపిలేంద్ర దేవా (1434–66 CE) 1434లో స్థాపించారు. కపిలేంద్ర దేవ పాలనలో, సామ్రాజ్యం సరిహద్దులు విపరీతంగా విస్తరించబడ్డాయి; ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని పెద్ద ప్రాంతాల నుండి, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లోని తూర్పు, మధ్య ప్రాంతాల నుండి.
జోహ్రాన్ క్వామే మమ్దానీ (జననం అక్టోబర్ 18,1991) ఒక అమెరికన్ రాజకీయవేత్త, ఆయన 2021 నుండి క్వీన్స్‌లో ఉన్న 36వ జిల్లా నుండి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశాడు. 2024లో, 2025 మేయర్ ఎన్నికలలో న్యూయార్క్ నగర మేయర్ కోసం తన అభ్యర్థిత్వాన్ని మమ్దానీ ప్రకటించాడు. డెమొక్రాటిక్ పార్టీ, డెమొక్రాట్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా సభ్యుడు అయిన ఆయన 2025 ఎన్నికలలో న్యూయార్క్ నగర మేయర్ కోసం డెమొక్రాటికల్ నామినీగా భావిస్తున్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.