The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
2025 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని తెలిపారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)
ది ఫ్యామిలీ మ్యాన్ హిందీలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 20 సెప్టెంబర్ 2019న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.
ఆంధ్రా కింగ్ తాలూకా 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు పచ్చిగొల్ల రచించి దర్శకత్వం వహించాడు. రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 12న, ట్రైలర్‌ను న విడుదల చేయగా, నవంబర్ 27న సినిమా విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
పాంచ్ మినర్ 2025లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, రాశి సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేశారు.
సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
మడావి హిడ్మా (1974 - 2025 నవంబరు 18) భారతీయ నక్సలైట్, అతను తన నియామకం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడికి హిడ్మాకు బాధ్యత ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన ఉన్నాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
ఓ భామ అయ్యో రామ 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. వి ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ బ్యానర్‌పై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్ గోదాల దర్శకత్వం వహించాడు. సుహాస్, మాళవిక మనోజ్, అనితా హస్సానందని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 24న, ట్రైలర్‌ను జులై 5న విడుదల చేయగా, సినిమాను జులై 11న విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
నాగ చైతన్య (జననం: 1986 నవంబరు 23) నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
విరాట్ కోహ్లీ భారతీయ క్రికెటరు . రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటరు. 2023 సెప్టెంబరు నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో 77 సెంచరీలు చేసాడు — 29 టెస్టు క్రికెట్లో, 47 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు), 1 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20Is)లో 2008 ఆగస్టులో శ్రీలంకపై తన తొలి వన్డే ఆడాడు.
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (ఆంగ్లం: International Day of Persons with Disabilities) - ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.
పింఛను, అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో వారి రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు లేదా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను.
శివాజీ రాజా (ఫిబ్రవరి 26 1962) తెలుగు సినిమా టీవి నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.