The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2025 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని తెలిపారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
గుమ్మడి నర్సయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ లేదా CPI (ML) లో ప్రముఖ సభ్యుడు. ఆయన 1983–1994, 1999–2009 మధ్య యెల్లండు నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలోని సభ్యులలో ప్రజా మనిషిగా పేరు సంపాదించారు.
మరపురాని కథ 1967, జూలై 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. 1964లో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా విడుదలైన కై కొడుత్త దైవమ్ తమిళ సినిమా నుండి ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమా 1970లో మలయాళంలో ప్రేమ్ నజీర్, పద్మిని, సత్యన్, జయభారతి ప్రధాన తారాగణంగా పలుంకు పాత్రమ్ అనే పేరుతో, 1971లో అమితాబ్ బచ్చన్, తనూజ జంటగా ప్యార్ కీ కహానీ పేరుతోను రీమేక్ చేయబడింది.
ప్రేమిస్తున్నా 2025లో విడుదలైన సినిమా. వరలక్ష్మి పప్పుల సమర్పణలో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించాడు. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 11న, ట్రైలర్‌ను అక్టోబర్ 29న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
గూనపాటి దీపక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (ప్రస్తుత అనువాదం; మొదట 1978లో మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటనగా అనువదించబడింది, English: Universal Declaration of Human Rights యూనివర్సల్ ప్రకటన ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేదా UNDHR యూన్.డి.ఎచ్.ఆర్) ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం. 1948 డిసెంబరు 10 న ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని పలైస్ డి చైలోట్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడవ సెషన్లో తీర్మానం-217 గా దీన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలో అప్పటి 58 మంది సభ్యులలో, 48 మంది అనుకూలంగా ఓటు వేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 12) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. అతను అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి.
సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. బరోడా సంస్థానాధిపతి శాయాజీ రావు గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
అఖండ 2021లో రూపొందిన, యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైంది.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కర్త. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.